అల్లు అర్జున్ లిటిల్ కుటుంబం చూశారా?

0Allu-arjun-familyఅల్లు వారి ఫ్యామిలీ అంటేనే.. అల్లు అరవింద్ నుండి అందరూ గుర్తొస్తారు. అయితే అందులో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా ఉంటారు. కాని అల్లు వారి లిటిల్ ఫ్యామిలీ అంటే మాత్రం ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ గురించే చెప్పుకుంటున్నారు. ఏదో మొన్న మొన్ననే పెళ్ళి చేసుకున్నాడు కుర్రాడు అనుకునేలోపే.. ఇద్దరు పిల్లలకు తండ్రి అవ్వగా.. వారు కూడా అప్పుడు ఫాస్టుగా ఎదిగిపోతున్నారు కూడా.

2011లో స్నేహా రెడ్డిని పెళ్ళి చేసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్.. 2014లో అల్లు అయాన్ కు తండ్రయ్యాడు. అలాగే ఈ దంపతులకు 2016లో కూతురు అర్హా కూడా పుట్టింది. నక్షత్రాలూ నామకరణలు అనే పట్టింపులకు పోకుడా పిల్లలకు కూడా A.A అనే ఇనీషియల్స్ వచ్చేలా పేర్లు పెట్టాడు బన్నీ. ఇప్పుడు ఆ పిల్లలతో కలసి భార్యాభర్తలిద్దరూ టైమ్ స్పెండ్ చేస్తూ.. ఆ మధురక్షణాలను ఫోటోల్లో బంధిస్తున్నారు. అదిగో అలా బంధించిన ఒక ఫోటో చూస్తుంటే చాలా ముద్దొస్తుంది కదూ. బుడతలిద్దరూ భలే క్యూట్ గా ఉన్నారులే.

ఈ లిటిల్ కుటుంబంతో టైమ్ గడుపుతూ.. మరోవైపు తన కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ కోసం కసరత్తులు చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక ఆయన భార్య స్నేహా రెడ్డి ‘పీక్ ఎ బూ’ అంటూ ఒక ఫోటో స్టూడియో స్థాపించి ఆ బిజినెస్ లో బిజీగా ఉంది.