అమల కి డైవర్స్ మంజూరు చేసిన కోర్టు

0Amala-Paul-vijayఎంతైనా కూడా.. కోర్టులో కేసు నలుగుతోందంటే.. అదొక పెద్ద విషయం. ఆ కేసు నుండి విముక్తి వచ్చే వరకు ఒక పట్టాన ప్రశాంతత ఉండదు. అది కూడానూ ఒక డైవర్స్ కేస్ అయితే మాత్రం.. నిజంగా ఆ కపుల్ ఇద్దరికీ కాస్త నరకమే. ఆల్రెడీ విడిపోదాం అని డిసైడయ్యాక.. మళ్ళీ కోర్టులో కేసు అన్నేసి రోజులు నానుతోందంటే.. ముఖ్యంగా మీడియాలో ఏదో ఒక వార్త వస్తూ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి.

సరిగ్గా ఇన్నాళ్ళూ అమలా పాల్ విషయంలో అదే జరిగింది. ఈ సెక్సీ బ్యూటి దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు క్రిస్టియన్ వెడ్డింగ్.. ఇటు హిందూ పెళ్లి.. రెండూ చేసుకున్నారు ఈ కపుల్. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తరువాత దాదాపు సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకుంది అమల. ఇంతలో ఏమైందో తెలియదు కాని.. ఆ తరువాత తిరిగి నటించాలని ఫిక్సయ్యింది. అందువలన మా ఫ్యామిలీకి నువ్వు ఇచ్చిన మాట తప్పావ్ అంటూ అమలా పాల్ పై అత్తింటివారి ప్రెజర్ పెరిగిపోయి.. చివరకు మనస్పర్ధలు పీక్స్ కు చేరుకుని.. డైవర్స్ కు దారితీసింది.

అయితే ఈ బుధవారం కోర్టు వీరికి కంప్లీట్ డైవర్స్ మంజూరు చేసింది. ఇప్పటికే అమల ఒక అరడజను సినిమాల్లో నటిస్తూ ఉండగా.. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయింది కాబట్టి ఇంకాసినన్ని సినిమాలు సైన్ చేస్తుందేమో చూడాలి. అలాగే విజయ్ కూడా అధినేత్రి ఫ్లాపయ్యాక మరో రెండు కొత్త సినిమాలు సైన్ చేశాడు.