ఆ యాంకర్ కు ‘డీసెంట్’ రోల్స్ కావాలి

0సినిమాల్లో అవకాశాల కోసం ఎలాంటి రోల్స్ అయినా చేసేస్తున్న రోజులు ఇవి. ముఖ్యంగా టీవీ యాంకర్లు తమను తాము ఫిలిం పర్సనాలిటీస్ గా మార్చుకునేందుకు.. అందాల ఆరబోత కూడా చేస్తున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే అని కొందరంటారు.. మరికొందరు అలా చేయకపోతే అవకాశాలు రావు కదా అంటారు. అయితే.. ఓ యాంకర్ మాత్రం తనకు డీసెంట్ రోల్స్ కావాలంటోంది.

ఓ పుష్కర కాలం క్రితం ఎన్టీఆర్ నటించిన రాఖీ మూవీ వచ్చింది. ఈ సినిమాలో హీరో చెల్లెలిగా నటించిన అమ్మాయి పేరు మంజూష. ఈ చిన్నది అప్పటినుంచి ఇప్పటివరకూ మరే సినిమాలోనూ నటించలేదు కానీ.. యాంకర్ గా ఫుల్లు బిజీగానే ఉంది. యాంకరింగ్.. లైవ్ ఈవెంట్స్.. ఆన్ లైన్ షోస్.. టీవీ కార్యక్రమాలతో తన కెరీర్ ను బిజీగానే గడిపేస్తోంది. ఇప్పటివరకూ 3500 ఇంటర్వ్యూలు చేసిందంటే.. మంజూష చేతిలో ఎంత వర్క్ ఉందో అర్ధమవుతుంది. అయితే.. సినిమాల్లో మాత్రం అసలు కనిపించడం లేదు ఈ బ్యూటీ.

ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో రాఖీ మూవీ చేశానన్న మంజూష.. ఆ తర్వాత తాను స్టడీస్ పై ఫోకస్ పెట్టానని చెబుతోంది. అయితే.. తన దగ్గరకు పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదనే విషయాన్ని కూడా అంగీకరిస్తున్న ఈ బ్యూటీ.. డీసెంట్ క్యారెక్టర్స్ తో మేకర్స్ వస్తే నటించడానికి అభ్యంతరం లేదని చెబుతోంది. క్యారెక్టర్ చిన్నదైనా పర్లేదు కానీ.. కథకు కీలకంగా ఉంటే నటించేస్తానని చెబుతోంది మంజూష.