కంగనాతో ధోనీ మాజీ లవర్ యుద్ధం!

0


Kangana-and-Ankita-Lokhandeబాలీవుడ్ టాప్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టుల వైపు అడుగులు వేస్తూనే ఉంటుంది. తన నటనా ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సిమ్రన్ అంటూ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్న కంగనా.. త్వరలోనే మణికర్ణిక మూవీ షూటింగ్ ప్రారంభించనుంది.

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక రూపొందనుండగా.. ఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్ చరిత్రే ఈ కథ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో ఆన్ స్క్రీన్ ధోనీ అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ గాళ్ ఫ్రెండ్ అంకిత లోఖండేకు ఓ కీలక పాత్ర దక్కింది. ఈ విషయాన్ని అంకిత కూడా కన్ఫాం చేసింది. ఎల్లప్పుడూ లక్ష్మీబాయ్ పక్కనే ఉంటూ.. ఆమెకు సలహాదారుగా వ్యవహరించే సైనికురాలు అయిన ఝల్కరీ బాయ్ పాత్రలో అంకిత కనిపించనుంది. ఇప్పటికే తాను యుద్ధ విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నానని చెప్పింది అంకితా లోఖండే.

‘నేను ఆమె గురించి అంతకు ముందెప్పుడూ వినలేదు. బహుశా చాలా మందికి తెలియదేమో. కానీ మన చరిత్రలో ఓ అద్భుతమైన వీర నారి ఝల్కరీ బాయ్. ఆమె కథను నేను ప్రపంచానికి చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. కంగనాతో పాటు నేను పోరాటాలు చేయాల్సి ఉంటుంది’ అని చెప్పింది అంకితా లోఖండే.