ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్-2018 ఫలితాలు విడుదల..

0



ఆంధ్రప్రదేశ్ఎడ్‌సెట్-2018 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేసారు. మొత్తం ఎడ్‌సెట్‌‌కు పరీక్షకు 7,679మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 7,430 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు.

గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. ఎడ్‌సెట్ పరీక్షలు వెంటేశ్వర యూనివర్శిటీ పరిధిలో జరిగాయని మంత్రి తెలిపారు. మార్చి 5న నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించామన్నారు. ఎడ్‌సెట్‌ పరీక్ష కోసం మొత్తం 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి మీడియా కు తెలిపారు.