కర్నాటకలో బాహుబలి-2 రికార్డ్

0Baahubali-2-huge-release-kaనిన్నమొన్నటి వరకు కర్నాటకలో ‘బాహుబలి-2’ సినిమా విషయంలో జరిగిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. కట్టప్ప(సత్యరాజ్) ఎప్పుడో చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

సత్యరాజ్ తాను చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పడంతో కన్నడ సంఘాలు శాంతించాయి. అయితే ఇన్నాళ్లు వారు చేసిన గొడవ, ఆందోళన బాహుబలి-2 సినిమాకు పబ్లిసిటీ పరంగా బాగా కలిసొచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఓ వైపు బాహుబలి-2 టీం ప్రమోషన్లకు తోడు…. కన్నడ సంఘాల గొడవ పుణ్యమా అని సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. సినిమాకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో కర్నాటకలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి-2 మూవీ కర్నాటకలో ఏకంగా 700 థియేటర్లలో రిలీజవుతోంది. అక్కడ లోకల్ స్టార్ల సినిమాలు కూడా ఈ రేంజిలో విడుదలవ్వడం చాలా అరుదు. అలాంటిది బాహుబలి-2 సినిమాను ఇంత భారీగా రిలీజ్ చేస్తున్నారంటే అక్కడ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

పరబాషా చిత్రమైనప్పటికీ బాహుబలి-2 సినిమాకు ఇంత డిమాండ్ ఉండటం, ఇంత భారీగా సినిమా రిలీజ్ అవుతుండటం చూసి లోకల్ స్టార్లు సైతం షాకవుతున్నారు.

కర్నాటకలో బాహుబలి పార్ట్-1 బాక్సాపీసు బిజినెస్ అప్పట్లో రూ. 33 కోట్ల వరకు జరిగింది. ఈ సారి సినిమా భారీగా రిలీజ్ అవుతుండటం, సినిమాపై క్రేజ్ కూడా భారీగా ఉండటంతో అంతకు రెట్టింపు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.