బాహుబలి ఒడిశాలో పుట్టాడు

0ప్రపంచంలో ఎటు చూసినా బాహుబలి ఫీవరే. సామాజిక మాధ్యమాలలోనూ, ఏ ఇద్దరు కలిసినా.. బాహుబలి గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరైతే బాహుబలి పేరుతో పాటు ఆ చిత్రంలోని కొన్ని పాత్రల పేరుతో పిలుచుకుంటున్నారు. ఒడిశాలో అయితే బాహుబలినే పుట్టాడు. నందన్‌ఖనాన్ జూపార్క్‌లో ఇటీవలే ఏడు పులి పిల్లలు జన్మించాయి. వీటిలో ఒక పులి పిల్లకు బాహుబలి అని నామకరణం చేశారు ఒడిశా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బిజయ్‌శ్రీ రౌట్రే. మిగతా పులిపిల్లలకు కుందన్, ఆద్యశా, షాహీల్, విక్కీ, శీను, మౌసుమి అనే పేర్లు పెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించింది. అమెరికాలోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి బాహుబలి 2కి. ఏప్రిల్ 28న బాహుబలి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.TIGER