దేవదాస్: చెట్టు కింద డాక్టర్ కష్టాలు

0అక్కినేని నాగార్జున – నాని లు కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో.. టీజర్ తో మెప్పించిన ‘దేవదాస్’ టీమ్ ‘వారు వీరు’ అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా చెట్టు కింద డాక్టర్ అంటూ సాగే మరో లిరికల్ సాంగును విడుదల చేశారు.

కష్టాల్లో పడి మునిగిపోయిన డాక్టర్ దాస్(నాని) గురించి వివరిస్తూ సాగుతుంది ఈ మెలోడీ. ఫన్ టోన్ లో సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మణిశర్మ ప్రేక్షకులను ఆకట్టుకునే ట్యూన్ అందించాడు. నాని పాత్రపై కొంచెం జాలి చూపిస్తూ సాగే ఈ పాటను పద్మలతా చాలా అందగా పాడింది. సిందరవందర సుందరవదనా అయ్యయ్యో ఇది నువ్వేనా అని మొదలయ్యే ఈ పాటలో ..’ఇదొక వింత ఘటన… నీకేమో రాదు నటన’ లాంటి పదాల ఛమక్కులు చాలానే ఉన్నాయి.

ఇంతకీ ఈ పాటను ఈరోజెందుకు రిలీజ్ చేసినట్టు? నాచురల్ స్టార్ ఫిలిం ఇండస్ట్రీ లో పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చెట్టుకింద డాక్టర్ పాటను రిలీజ్ చేసింది ‘దేవదాస్’ బృందం. ఇక ఆలస్యం ఎందుకు… డాన్ దేవా & కో దెబ్బకు హైరానా పడుతున్న చెట్టుకింద డాక్టర్ సంగతేంటో మీరు వెంటనే చూడండి.