ఇంద్రజ కు జగదేకవీరుడి కన్నీటి వీడ్కోలు…

0అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఐదు రోజులు కావొస్తుంది..అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచారు. నిన్న సాయంత్రం నుండే అభిమానులు , సినీ తారలు కడసారి చూసేందుకు పోటీ పడుతున్నారు. బాలీవుడ్ , కోలీవుడ్ , టాలీవుడ్ , శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీ ల తారలు , ప్రముఖులు శ్రీదేవి ను చూసేందుకు వస్తున్నారు. ఇక టాలీవుడ్ నుండి సీనియర్ హీరోలు చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున మొదలగు స్టార్స్ వెళ్లడం జరిగింది.

బుధవారం ఉదయం ముంబై వెళ్లిన చిరంజీవి శ్రీదేవి పార్థీవ దేహానికి అంజలి ఘటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు – అతిలోక సుందరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొట్టిందో చెప్పాల్సిన పనిలేదు.ఆ చిత్రంలో దేవకన్య పాత్రలో నటించిన శ్రీదేవి.. ఆ పాత్ర కోసమే పుట్టిందా అనేంతలా మెప్పించింది.. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి ని అంత అతిలోక సుందరి అని పిలవడం మొదలు పెట్టారు. మరికొద్ది సేపట్లో శ్రీదేవి అంతిమ యాత్ర మొదలు కానుంది.