హెబ్బా ఏంటా ఫోజు?

0సామాజిక మాధ్యమాల్లో కుర్ర భామల కవ్వింతకు కొదవేం లేదు. ఆరోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని.. ఈరోజుల్లో ఇలా అయ్యాను! అంటూ ఫోటో కలెక్షన్ లోంచి ఏదో ఒకటి పోస్ట్ చేసి అభిమానుల్ని ఊరించేస్తుంటారు. ఇదిగో నా కర్వ్స్ చూడండి! అంటూ వేడెక్కించే ఫోటోలతోనూ కవ్వించేస్తున్నారు. అదాశర్మ అయితే వేరెవరికీ సాధ్యంకాని కొంటె వ్యవహారాలతో నిత్యం ఫ్యాన్స్ కి సామాజిక మాధ్యమాల్లో బోలెడంత వినోదం పంచుతోంది.

ఇప్పుడు అదే బాటలో ఇతర నాయికలు ప్రయాణిస్తున్నారు. కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గానే ఉంది. ఈ భామ తాజాగా ఓ పాత కాలంనాటి ఫోటోని షేర్ చేసి .. ఫ్యాన్స్ ని కవ్వించింది. ఈ ఫోటోకి లైక్ లు – హిట్లు హోరెత్తాయి. ఫోటో సూపర్భ్ అని కొందరు కామెంట్ చేస్తే .. మరీ అంత పాత ఫోటో ఏంటో అని కొందరు. కొత్త ఫోన్ తో తీయొచ్చు కదా! అని వేరొక అభిమాని కామెంట్ చేశారు. ఆ పాదాన్ని ఇలా ఇస్తే నెత్తి మీద పెట్టుకుంటాననే అర్థంలో వేరొక కొంటె అభిమాని సెటైర్ వేశాడు.

నీకు మేకప్ సూట్ కాదని ఒకడు – సూపర్భ్ క్లారిటీ ఫోటో అని వేరొకడు – డే బై డే సెక్సీగా మారుతున్నావ్.. అని ఇంకొకడు తెగ అభిమానం చూపించేశారు. వెరీ హాట్ సో ప్రెట్టీ.. స్టన్నింగ్! అంటూ వేరొక వీరాభిమాని కామెంట్ చేశారు. మొత్తానికి హెబ్బాని ఇన్ స్టా – ట్విట్టర్ లో అభిమానులు బాగానే ఫాలో చేస్తున్నారని అర్థమవుతోంది. ఇటీవల `ఎక్కడికిపోతావు చిన్నవాడా?` చిత్రంతో విజయం అందుకున్న హెబ్బా – ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్ ల బాట పట్టింది. వరుసగా మూడు ఫ్లాప్ లు ఎదుర్కొంది. ప్రస్తుతం కెరీర్ ని రాంగ్ ట్రాక్ లోంచి రైట్ ట్రాక్ లోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతోంది. 24 కిస్సెస్ అనే చిత్రంతో సీరియల్ కిస్సర్ గా మరోసారి సెన్సేషన్స్ కి రెడీ అవుతున్న హెబ్బాని ఈ సినిమా అయినా ఆదుకుంటుందేమో చూడాలి.