చెన్నైలో `కాలా` సరికొత్త రికార్డు!

0తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు దక్షిణాదితో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. తలైవా సినిమా కోసం వారంతా వేయి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రజనీ సినిమాతో క్లాష్ కాకుండా తమ సినిమాలను రిలీజ్ లను మిగతా సినిమాల నిర్మాతలు ప్లాన్ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. తలైవా సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉంటాయని `కబాలి` నిరూపించింది. అయితే తాజాగా విడుదలైన `కాలా` సినిమాకు అంతగా బజ్ లేకపోవడం – డివైడ్ టాక్ రావడం వంటి నేపథ్యంలో ఈ సినిమా ఓపెనింగ్స్ గత సినిమాలలాగా ఉండకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే వీరి అంచనాలను పటాపంచలు చేస్తూ….`కాలా` సినిమా చెన్నైలో రికార్డు ఓపెనింగ్స్ ను వసూలు చేసింది. చెన్నైలో తొలిరోజు ఈ సినిమా రూ.1.76 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందంటే తమిళనాడులో తలైవాకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.

కర్ణాటకలో `కాలా`విడుదలపై గొడవ జరగడం…అక్కడ చాలా థియేటర్లలో ఆ సినిమా విడుదల కాకపోవడం తెలిసిందే. దీంతోపాటు `కాలా` సినిమాకు ప్రమోషన్ సరిగా చేయకపోవడం వల్లే కబాలికి వచ్చినంత బజ్ రాలేదని టాక్ ఉంది. `కబాలి` తో పోలిస్తే `కాలా` సినిమా చాలా బెటర్ అని ప్రమోషన్ గట్టిగా చేసి ఉంటే డివైడ్ టాక్ కాకుండా…హిట్ టాక్ వచ్చి ఉండేదని విమర్శకుల అభిప్రాయం. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చెన్నైలో `కాలా`సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయి. చెన్నైలో `కాలా` మొదటిరోజు రూ.1.76 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. చెన్నైలో తొలిరోజు అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన సినిమాగా `కాలా` రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రూ.1.52 కోట్ల గ్రాస్ తో విజయ్ ‘మెర్సల్` పేరిట ఆ రికార్డు ఉంది. మిక్స్ డ్ టాక్ వస్తోన్న `కాలా`మూవీ లాంగ్ రన్ లో ఎంత రాబడుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.