కంగన ముద్దులకు మీసాలు అడ్డం!

0kangana-kissing-scenesఈ నెల 24న బాలీవుడ్ మళ్లీ విశాల్ భరద్వాజ్ ప్రభంజనం చూడబోతోంది. సినిమాకు కలక్షన్లు ఎలా ఉన్నా కూడా.. మనోడు ఒక ప్రోడక్టును వెడితెరపై ఆవిష్కరించాడంటే.. ఖచ్చితంగా నటులకూ సాంకేతిక నిపుణులకూ అవార్డులే అవార్డులు అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ”రంగూన్” సినిమాతో అలాంటి ప్రభంజనమే సృష్టిస్తాడని అందరి ఫీలింగ్.

ఈ సినిమాలో శృంగారభరిత సన్నివేశాలకు ఇప్పటికే ఇంటర్నెట్ ఠారెత్తిపోతోంది. ఎందుకంటే సినిమాలో కంగనా రనౌత్ నడిపే ట్రైయాంగులర్ లవ్ స్టోరి ఓ రేంజులో ఉంటుందిలే. ఒక ప్రక్కన సైఫ్ ఆలీ ఖాన్ తో మరో ప్రక్కన షాహిద్ కపూర్ తో అమ్మడు రొమాన్స్ కోసం రోమాలు నిక్కబొడుచుకునేలా పెర్ఫామ్ చేసింది. కాని వాళ్ళను పెదాలపై ముద్దులాడ్డానికి చాలా ఇబ్బందే పడ్డాను అంటోంది కంగన. ఇద్దరికీ సినిమా పరంగా బారుపాటి మీసాలు పెంచాల్సి రావడంతో.. కంగన వీరి పెదాలను కొరుకుతున్నప్పుడల్లా.. ఆ మీసాలు ఆమె పై పెదానికి గుచ్చుకుపోయేవట. అలా లిప్ కిస్సుల తరువాత తనకే డ్యామేజ్ జరిగిందని చెప్పుకొచ్చింది అమ్మడు. మొత్తానికి ఆ ముద్దుల జాతరలో మీసాలు ఇబ్బంది పెట్టేశాయనమాట.

ఇప్పటికే ఫ్యాషన్.. క్వీన్.. రివాల్వర్ రాణి.. వంటి సినిమాల్లో తన పెర్ఫామెన్స్ తో చాలా కితాబులే అందుకున్న కంగన.. ఇప్పుడు రంగూన్ కూడా ఆ లిస్టులో చేరిపోతుందని చెబుతోంది. అది సంగతి.