క్వీన్ కాదు క్యాట్ ఉమెన్

0అమెరికన్ కామిక్ బుక్స్ లో క్యాట్ ఉమెన్ ఓ సెన్సేషన్. ప్రఖ్యాత డీసీ కామిక్స్ క్యాట్ ఉమెన్ అనే ఇమాజినరీ క్యారెక్టర్ తో బోలెడన్ని పుస్తకాల్ని విక్రయించింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకాలు ఫేమస్. స్కూల్ టీనేజీ పిల్లలు విపరీతంగా అభిమానించి చదివేవారు. ఆ తర్వాత ఆ కామిక్ రోల్ స్ఫూర్తితోనే `క్యాట్ ఉమెన్` సినిమా తీశారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. క్యాట్ ఉమెన్ గా హ్యాలీ బెరీ నటన అల్టిమేట్.

అందుకే ఆ తరహా క్రియేటివిటీతో ఇండియన్ వెర్షన్లో సినిమా తీస్తే సూటయ్యే కథానాయిక ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క కంగన మాత్రమే అని చెప్పొచ్చు. `క్రిష్ -3`లో ఈ భామ సూపర్ ఉమెన్‌గా నటించి మెప్పించింది. సూపర్‌మేన్‌గా హృతిక్ నటనకు ఎంత పేరొచ్చిందో సూపర్ ఉమెన్‌గా కంగన నటనకు అంతే పేరొచ్చింది.

ప్రస్తుతం `మణికర్ణిక` చిత్రంలో నటిస్తోంది. వారియర్ క్వీన్ ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో నటిస్తోంది. ఆ తర్వాత కంగన క్యాట్ ఉమెన్‌గా కనిపిస్తుందేమో చూడాలి. ఇదిగో సామాజిక మాధ్యమాల్లో లేటెస్ట్ ఫోటో చూస్తే అచ్చం హ్యాలీ బెర్రీ క్యాట్ ఉమెన్ లుక్‌నే తలపిస్తోంది. బులుగు జిలుగు డ్రెస్.. కాంబినేషన్ బ్లూ లైనర్ కనుబొమలు.. ఆ లెవల్లో ఫోజిచ్చింది మరి!హ్యాలీ బెరీ.. జెన్నిఫర్ .. షారాన్ స్టోన్ .. వీళ్లెవరూ ఆవిడకు సరిరాలేరు! ది గ్రేట్ డేరింగ్ టెంపర్ గాళ్.