అఖిల్ సినిమా నుండి మేఘ అవుట్

0తన మూడో చిత్రంపై దృష్టి పెట్టాడు అఖిల్. ఈ సినిమా కోసం పలు కథలు విన్నాడు అఖిల్‌. ఇప్పుడు తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరిదర్శకత్వంలో అఖిల్‌ సినిమా చేస్తున్నాడు. ఇటివలే సినిమాపై క్లాప్ పడింది. మ్యూజిక్ దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడు. అతడే థమన్.

కాగ ఈ సినిమాలో మేఘ ఆకాష్ ను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఇప్పుడు నిర్ణయం నుండి వెనక్కి వెళ్ళారని తెలుస్తుంది. లై సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. అది పెద్ద డిజాస్టర్ అయింది. తాజాగా ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా పెద్దగా కలసిరాలేదు. దీంతో ఫ్లాఫ్ సెంటిమెంట్ ప్రకారం నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తుంది. ఆమె స్థానంఓ మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.