జబర్దస్త్ కమెడియన్ కోసం పోలీసుల వేట

0జబర్దస్త్ కమెడియన్ కోసం వేట మొదలైంది. డబ్బు ఆశతో అక్రమ బాట పట్టిన హరిబాబు కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హరిబాబును పట్టుకోవడానికి మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జబర్దస్త్ చేస్తున్న సమయంలోనే డబ్బు ఆశతో హరిబాబు పక్కదారి పట్టాడు. ఎర్రచందనం స్మగ్లర్ల తో పరిచయం పెంచుకున్నాడు.. టీవీ సీరియల్స్ – స్టేజ్ షోలు చేసుకుంటేనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు..

గత రోజులుగా తప్పించుకు తిరుగుతున్న హరిబాబు పై 10 పోలీసు స్టేషన్ లో 13 కేసులు నమోదయ్యాయి.. పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు..