చరణ్ సరసన ఆ హీరో కూతురు??

0Ram-Charan-To-Launch-Sara-ali-khanకొందరు సినీ తరాల వారసులు ఒక్క సినిమా అయినా తియ్యకముందే ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా హీరోల కూతుళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు వారిపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటారు. దీంతో వారు కూడా మొదటి సినిమాను ఎంతో కష్టపడుతూ..జాగ్రత్తపడుతూ చేస్తారు. కానీ మొదటి సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా మరో సారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కష్టమే.

ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అమ్మడు తన గ్లామర్ లుక్కులతో ఆల్రెడీ చాలామంది కుర్రాళ్లను తన లుక్స్ కు ఫిదా చేసుకుంది. లేటెస్ట్ రూమర్ ఏంటంటే.. రామ్ చరణ్- మణిరత్నం కాంబో లో తెరకెక్కబోతున్న ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో మెగా హీరో తో రొమాన్స్ చేయనుందట అమ్మడు. తెలుగు-తమిళ్ మరియు హిందీ లో తెరకెక్కబోయే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకుముందే చాలా సార్లు ఈ ప్రముఖ దర్శకుడితో చరణ్ సినిమాను తియ్యబోతున్నాడని టాక్ వచ్చింది కానీ.. ఏమైందో ఏమో గాని ఆ తర్వాత మెగా హీరో మరియు మణిరత్నం ఆ విషయంపై స్పందించలేదు.

గత కొంత కాలంగా మణిరత్నం సినిమాలు ఏది అంతగా హిట్ కావడం లేదు. రీసెంట్ గా కార్తితో తీసిన చెలియా కూడా నిరాశపరిచింది. మరి ఫెయిల్యూర్ లో ఉన్న దర్శకుడితో చరణ్ సినిమా తీస్తాడా అనేది సందేహంగానే ఉంది. ముఖ్యంగా చరణ్ బాలీవుడ్ లో “జంజీర్” అనే సినిమాను తీసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నాడు. మరి సైఫ్ అలీ ఖాన్.. రామ్ చరణ్ తో తన కూతురి తొలి సినిమాను చేయనిస్తాడా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ విషయం తెలియాలంటే రామ్ చరణ్- మణిరత్నం సినిమా సెట్స్ పైకి వచ్చేంత వరకు ఆగాల్సిందే.