ప్రగ్యా జైశ్వాల్‌తో కలిసి మెగాహీరో రచ్చ

0


మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొచ్చిన కుర్ర హీరోల్లో ఒకరు సాయిధరమ్ తేజ్. ప్రారంభంలో తడబడిన గానీ వరుస హిట్లతో జోరుమీద ఉన్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో అనే పేరును సంపాదించుకొన్నాడు. పాటలు, ఫైట్లే కాదు.. డ్యాన్సుల్లోనే మామ తగ్గ అల్లుడు అనిపించుకొంటున్నాడు. తాజాగా నక్షత్రం, జవాను చిత్రంలో నటిస్తున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో దుర్గా అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నక్షత్రం సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌లో సాయిధరమ్ సాగించిన శృంగారం చర్చనీయాంశమవుతున్నది.

నక్షత్రం సినిమాలో సాయిధరమ్ తేజ్, కంచే ఫేం ప్రగ్యా జైశ్వాల్‌తో ‘ఏ పాపా.. ఏ పాపమ్’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాటను చూస్తే ఖడ్గం, అంతపురం చిత్రాల్లోని ఓ పాట గుర్తుకురాక మానదు. కృష్ణవంశీ తీసే ప్రతీ చిత్రంలోనూ ఓ హాట్ సాంగ్ ఉండటం కంపల్సరీ. నక్షత్రం చిత్రంలోనూ అదే పంథాను అనుసరించాడు.

ఏ పాపా.. ఏ పాపమ్ అనే పాట ఉన్న టీజర్ ఇటీవల విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఆ పాటలో హీరోయిన్‌ ప్రగ్యాతో సాయి జరిపిన శృంగారం హాట్‌హాట్‌గా ఉంది.

పూర్తిగా శృంగారభరితంగా ఉన్న ఈ పాటలో సాయి, ప్రగ్యాలు హాట్ హాట్‌గా కనిపించారు. విభిన్నమైన భంగిమల్లో మతిపొగొడుతున్నారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.

కంచె, ఓ నమో వెంకటేశాయ చిత్రాలలో సంప్రదాయంగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఈ పాట ద్వారా టాలీవుడ్‌లో తాడో పేడో పేల్చుకునేందుకు సిద్ధమైనట్టు కనిపించింది. గ్లామర్ స్టార్ అనే ముద్ర వేయించుకోవడానికి రెడీగా ఉన్నట్టు స్పష్టమైంది.

నక్షత్రం చిత్రంలో సందీప్ కిషన్‌, రెజీనా కసండ్రా, ప్రగ్యా జైస్వాల్, సాయిధరమ్ నటిస్తున్నారు. సీనియర్ నేటి శ్రియ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరువనున్నది. ఆడియో కార్యక్రమానికి కూడా శ్రీయ హాజరుకావడం విశేషం.

నక్షత్రం చిత్రంలో పోలీస్ పాత్రల్లో సందీప్ కిషన్, సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ నటిస్తున్నాడు. ఇక సాయిధరమ్ తేజ్ కోసం ప్రత్యేకంగా పాత్రను మలిచినట్టు టీజర్లలో స్పష్టమవుతున్నది. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ పాత్రను పోలినట్టు ఉంది.

పక్కా పోలీస్‌ బ్యాకడ్రాప్‌తో రూపొందిన నక్షత్రం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అన్ని మసాలా నింపినట్టు కనబడుతున్నది. ఈ చిత్రం జూలై నెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.