అల్లుడి వైపే ట్రేడ్ టర్న్

0ఈ వారం సందడి చేయబోతున్న శైలజారెడ్డి అల్లుడు-యుటర్న్ లు భార్యాభర్తల మధ్య ఆసక్తికరమైన బాక్స్ ఆఫీస్ పోరుకు తెరతీస్తున్నాయి. పైకి పోటీగా కనిపిస్తున్నప్పటికీ రెండు ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని జానర్లు. శైలజారెడ్డి అల్లుడు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని వస్తుండగా యుటర్న్ థ్రిల్లర్ మూవీగా భారం మొత్తం సమంతా ఒక్కర్తే మోసుకుని వస్తోంది. ట్రేడ్ పరంగా చూసుకున్న ఫైనల్ గా గురువారం ఓపెనింగ్స్ ని అల్లుడే డామినేట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం చాలా స్పష్టం. శైలజారెడ్డి అల్లుడులో చైతుతో పాటు వేరే ఆకర్షణలు చాలా ఉన్నాయి. అను ఇమ్మానియేల్ గ్లామర్ అత్తగా రమ్య కృష్ణ ప్రెజెన్స్ నరేష్ మురళి శర్మ లాంటి సీనియర్లు వెన్నెల కిషోర్ కామెడీ ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన మసాలాలు అన్ని ఉన్నట్టుగా ట్రైలర్ లోనే చూపించేసారు. సో సహజంగా పూర్తి ఎంటర్ టైన్మెంట్ ఆశించే ప్రేక్షకులు దీని వైపే ఉంటారు.

మరోవైపు యుటర్న్ ని సమంతా ఒక్కర్తే తన భుజాల మీద మోస్తోంది. భూమిక రాహుల్ రవీంద్రన్ ఆది పినిశెట్టి లాంటి పేరున్న ఆర్టిస్టులు ముగ్గురే ఉండటంతో టాక్ ని బట్టి వెళదాంలే అనుకునే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. మరోవైపు థ్రిల్లర్ మూవీస్ కి మార్కెట్ స్పాన్ తక్కువగా ఉంటుంది. బలమైన ఇమేజ్ ఉన్న హీరో ఉంటే ఆ కేసు వేరు కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ కాబట్టి అద్భుతాలు ఆశించలేం కానీ చాలా బాగుంది అనే టాక్ వస్తే మాత్రం మెల్లగా ఎగబాకడం ఖాయం. కానీ శైలజారెడ్డి అల్లుడుతో పోటీ పడాలి అంటే మాత్రం చాలా విషయంతో మెప్పించాల్సి ఉంటుంది. కన్నడలో ప్రూవ్ అయిన రీమేక్ అయినప్పటికీ ఇక్కడా అదే ఫలితం మీద నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. కానీ సోలోగా అయితే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు మాత్రం సమంతకు భర్త నుంచి కొంత టఫ్ కాంపిటీషన్ తప్పదు.