సల్మాన్ కు బెయిల్ వచ్చిందోచ్ ..

0సల్మాన్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్…కృష్ణజింక కేసులో శిక్ష అనుభవిస్తున్న సల్మాన్ కు జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. గత మూడు రోజులుగా సల్మాన్‌ జోధ్‌పూర్‌లోని జైలు కు శిక్షననుభవిస్తున్న సంగతి తెలిసిందే. 1998 అక్టోబర్‌లో జరిగిన ఓ షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. అప్పటి నుండి ఈ కేసు నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యం లో జోధ్‌పూర్‌ కోర్ట్ ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

మూడు రోజులుగా సల్మాన్ జైలు లో గడిపాడు. ఈరోజు న్యాయస్థానం ఎదుట వాదనలు విన్పించిన ఆయన తరుపు న్యాయవాదులు.. విచారణలో చాలా లోపాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో సల్మాన్‌ వద్ద ఎలాంటి మారణాయుధాలు లేవని.. కేసు దాఖలు చేసిన వారు సైతం సల్మాన్‌ వద్ద మారణాయుధాలున్నాయనిగానీ.. జింకలను అతడే చంపాడని గానీ నిరూపించలేకపోయారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.50వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. ఇవాళ రాత్రి 7 గంటలకల్లా సల్మాన్‌ జైలు నుంచి బయటికొస్తారని తెలుస్తుంది.