7 నెలల గర్భంతో సానియా

0ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రస్తుతం తల్లి ప్రేమను అనుభవిస్తోంది. దాదాపు 7 నెలలుగా టెన్సిస్ కు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు నిండు గర్భవతి.. 7నెలల గర్భంతో సానియా ఉన్న ఫొటో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కోసం ఆమె ఈ ఫొటో షూట్ నిర్వహించింది. సానియా చెల్లెలు ఆనం మీర్జా ఆధ్వర్యంలో ఈ ఫొటో షూట్ జరిగింది. అక్క ఫొటోలను ఆనం సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్ లు వైరల్ గా మారాయి..

2010లో సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరూ కెరీర్ మీద దృష్టి పెడుతూ ఇన్నాళ్లు పిల్లలు కాకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏప్రిల్ లో సానియా మీర్జా తాను తల్లి కాబోతున్నానని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. ఈ అక్టోబర్ లో సానియా పండంటి బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో తాజా ఫొటో షూట్ లో సానియా కనిపించి అభిమానులను అలరించింది.