జనవరి 12వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు

0school-holidaysఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 22వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.