ఎట్టకేలకు శ్రియా పెళ్లి ఫోటో

0హీరోయిన్ శ్రియా వివాహం చేసుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన ప్రియుడు ఆండ్రీ కోశ్చీవ్‌ను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్రియ..ఆండ్రీ పెళ్లి చేసుకున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అయితే వీరిద్దరూ ఉదయ్‌పూర్‌లో కాకుండా ముంబైలో స్నేహితులు, కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నప్పుడు తీసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆండ్రీ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. దాదాపు ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. కాగా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెబుతుంది శ్రియా.