Templates by BIGtheme NET
Home >> Cinema News >> Swetha Basu : ఫొటోటాక్ : ఆఫర్ల కోసం బక్క చిక్కిందా?

Swetha Basu : ఫొటోటాక్ : ఆఫర్ల కోసం బక్క చిక్కిందా?


కొత్త బంగారు లోకం సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్వేత బసు ప్రసాద్ ఆతర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కాని అమ్మడి అదృష్టం బాగా లేకపోవడమో లేక సరైన నిర్ణయాలు తీసుకోక పోవడమో కాని ఈ అమ్మడికి త్వరలోనే ఇండస్ట్రీ నుండి చేదు అనుభవం ఎదురయ్యింది. ఒకానొక సమయంలో ఆఫర్లు లేక చిన్నా చితక సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు స్టేజ్ షో లు కూడా చేసింది.

ఆమద్య పెళ్లి చేసుకోవడంతో ఇక ఈమె ఇండస్ట్రీకి దూరం అయినట్లే అనుకున్నారు. కాని భర్త నుండి విడిపోవడం వల్ల మళ్లీ సినిమాల్లో ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు గాను ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఆమద్య మరీ ఎక్కువ బరువుగా అనిపించిన ఈ అమ్మడు తాజాగా కాస్త బరువు తగ్గినట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది.

శ్వేత బసు ప్రసాద్ మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలించేను అనేది చూడాలి. గతంలో మాదిరిగా కేవలం సినిమాల్లో నే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో కూడా ఆఫర్లు ఉంటున్నాయి. ఒక వేళ శ్వేత బసుకు వెబ్ సిరీస్ మేకర్స్ నుండి ఏమైనా పిలుపు దక్కేనో చూడాలి. హిందీలో కూడా ఈమె తనకు ఉన్న పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తోంది.