శ్రీదేవి, బోనీ మధ్య గొడవ..ఓ షాకింగ్ నిజం

0శ్రీదేవి ఎలా చనిపోయింది.. యావత్ భారతావని మదిలో ఇప్పుడీ ఒక్క ప్రశ్నే మెదులుతోంది. ఆమె మృతిపై వస్తున్న వార్తలు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. థ్రిల్లర్ సిన్మాకు ఏమాత్రం తీసిపోని రీతిలో 48 గంటలుగా అతిలోక సుందరి మరణ చిత్రం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. ముఖ్యంగా దుబాయ్ అధికారులు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ని సుదీర్ఘంగా విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీలావుంటే.. దుబాయ్ పెళ్లిలో శ్రీ‌దేవి బోనీల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని, ఈ గొడ‌వ వ‌ల్ల శ్రీ‌దేవి పూర్తిగా మ‌న‌స్థాపానికి గురైంద‌ని, పెళ్లి లోంచి శ్రీ‌దేవి అర్థాంత‌రంగా హోటెల్‌కి వెళ్లిపోయింద‌ని ఒక వార్త బయటికి వచ్చింది. బోణీ తొలి భార్య పిల్ల‌ల‌కు త‌న ఆస్తిలో వాటా ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని, అది శ్రీ‌దేవికి కోపం తెప్పించాయ‌ని తెలుస్తోంది. శ్రీ‌దేవి వ‌ల్లే.. బోనీ ఆస్తులు కూడ‌గ‌ట్టుకున్నాడ‌నిఒక వాదన వుంది ‘ఈ ఆస్తుల‌న్నీ నావే. కాబ‌ట్టి నా పిల్ల‌ల‌కే చెందాలి’ అని శ్రీ‌దేవి గ‌ట్టిగా చెప్పేద‌ని, స‌రిగ్గా అదే గొడ‌వ దుబాయ్ పెళ్లిలోనూ జ‌రిగింద‌ని, ‘ఆస్తుల‌పై ఓ క్లారిటీ వ‌చ్చేంత వ‌ర‌కూ దుబాయ్ విడిచి రాను’ అని శ్రీ‌దేవి భీష్మించుకుని కూర్చుంద‌ని, కోపంతో దుబాయ్ నుంచి ముంబై వ‌చ్చేసిన బోనీ.. మ‌ళ్లీ శ్రీ‌దేవిని బుజ్జ‌గించ‌డానికి దుబాయ్ వెళ్లాడ‌ని, అక్క‌డ మ‌రోసారి గొడ‌వ చోటుచేసుకుంద‌ని కధనాలు వస్తున్నాయి. ఏదేమైనా అతిలోక సుందరి లోకం విడిచిపెళ్లిపోవడం చాలా బాధాకరం.