సురభి తప్పు చేస్తుందా…?

0బీరువా చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచమైన ఢిల్లీ భామ సురభి..ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యం లో అమ్మడికి సెకండ్ హీరోయిన్ ఛాన్సులు తెగ వస్తున్నాయట..కానీ అమ్మడు మాత్రం ఫస్ట్ హీరోయిన్ గా అయితేనే చేస్తా తప్ప సెకండ్ హీరోయిన్ గా మాత్రం చేయనని తెగేసి చెపుతోందట.

నితిన్ , రాశిఖన్నా జంటగా దిల్ రాజు తెరకెక్కిస్తున్న శ్రీనివాస కళ్యాణం , అలాగే నిన్న పూజ కార్య క్రమాలు పూర్తి చేసుకున్న రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం లోను సెకండ్ హీరోయిన్ గా సురభి ని అనుకున్నారట. కానీ ఆమె మాత్రం ఆ రెండు సినిమాల్లో నటించానని చెప్పడం తో అంత షాక్ అయ్యారట. ఇలా ఫస్ట్ హీరోయిన్ గా అయితేనే చేస్తా అంటే మొదటికే మోసం వస్తుందని ఆమె సన్నిహితులు చెపుతున్నారట. మరి సురభి ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.