చిరంజీవిని ఘోరంగా అవమానించిన నటి

0


ఇంతకు ముందుకంటే ఇప్పుడు సెలబ్రిటీ అవ్వటం చాలా వీజీ ఏదో ఒక యూట్యూబ్ చానెల్ కి ఓ ఇంటర్వ్యూ ఇస్తే చాలు మీరూ సెలబ్రిటీ అయిపోయినట్టే. అలాగే ఇప్పుడు సెలబ్రిటీ అయిన టీవీ నటి నీతూ నారాయణ్ ఆ ఎక్సైట్మెంట్ లో నోరు జారేసింది. కొంత మంది యంగ్ హీరోలు ఒకటి – రెండు సినిమాలు చేసి సూపర్ స్టార్లుగా ఫీల్ అయిపోతున్నారని. చెప్పిన నీతూ ఏకంగా మెగా స్టార్ చిరంజీవి మీదనే ఓ పంచ్ వేసేసింది..

మీ అభిమాన హీరో ఎవరనే అనే ప్రశ్నకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ముందు ప్రశ్న కరెక్ట్ గా అడగడం నేర్చుకోండని యాంకర్ కు నీతూ చెప్పింది. ‘పవన్ కల్యాణ్ తర్వాత మీ అభిమాన హీరో ఎవరు?’ అని అడగాలని నీతూ చెప్పింది. తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా అభిమానమని ఆయన తర్వాత చిరంజీవిని అభిమానిస్తానని చెప్పింది.

ఇంతటితో ఆగకుండా మరిన్ని వ్యాఖ్యలు చేసింది. యాక్టింగ్ పరంగా చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి పర్సనల్ లైఫ్ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పింది. ఎవ్వరికీ సాయం చేయనప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా ఏం లాభం అన్న అర్థం వచ్చేటట్టు ఆమె వ్యాఖ్యలున్నాయి.

ఎందుకలా? అన్నదానికి కూడా వివరణ ఇస్తూ పెద్ద హీరోగా చెలామణి అవుతూ ఎంత డబ్బు సంపాదించినా ఏం ఉపయోగం లేదని, ఇతరులకు మంచి చేయాలనే గొప్ప గుణం పవన్ లో ఉందని నీతూ కితాబిచ్చింది. అందుకే పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అని తేల్చి చెప్పింది. సినిమాలు హిట్ అయినంత మాత్రాన పెద్ద హీరోలు కాదని… హెల్పింగ్ నేచర్ ఉన్నవారే రియల్ హీరో అని నీతూ అంది.

సమస్యలపై పవన్ కల్యాణ్ వెంటనే స్పందిస్తారని కష్టాల్లో ఉన్న సీనియర్ నటులకు ఆయన సాయం చేసినట్లు తాను విన్నానని చెప్పింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు చిరాకు పడుతున్నారు. సోషల్ మీడియా లో ఆమె మీద విమర్శలు మొదలయ్యాయి.