రెండో టీ20లో విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డ్

0Virat-Kohli-T20-duckగువాహటి: ఆస్ట్రేలియాతో రెండో టీ20ని టీమిండియా ఓడిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి డకౌటయ్యాడు. ఇలాంటి మ్యాచ్‌లో విరాట్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఆ డకౌటే రికార్డు మరి. కోహ్లికి టీ20ల్లో ఇది తొలి డకౌట్ కావడం విశేషం. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. డకౌట్ లేకుండా ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన రికార్డు అది. 47 టీ20ల తర్వాత విరాట్ తొలిసారి డకౌటయ్యాడు. 40 మ్యాచ్‌లతో పాక్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును విరాట్ బీట్ చేశాడు.

ఇక ఈ డకౌట్‌కు మరో విశేషం కూడా ఉంది. 85 టీ20ల తర్వాత ఓ ఇండియన్ కెప్టెన్ డకౌటయ్యాడు. ఇది కూడా ఓ రికార్డే.

ఇక విరాట్ డకౌట్‌కు కారణమై ఈ రెండు రికార్డులు నమోదయ్యేలా చేసిన ఆసీస్ బౌలర్ బెహ్రెన్‌డార్ఫ్‌కు మరో రికార్డు కూడా ఉంది. విరాట్‌ను టీ20ల్లో తొలిసారి డకౌట్ చేసిన ఈ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లోనే ఇండియన్ టీమ్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ సచిన్, ద్రవిడ్ చివరిసారి డకౌటయ్యారు.