ఫస్ట్ లుక్: యుద్ధం శరణం అంటున్న చైతూ

0


పోయినేడాది దసరాకు ‘ప్రేమమ్’తో.. ఈ ఏడాది వేసవిలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో తక్కువ వ్యవధిలో రెండు హిట్లు కొట్టేశాడు అక్కినేని నాగచైతన్య. అంతలోనే మరో సినిమాతో రెడీ అయిపోతున్నాడు చైతూ. ‘రారండోయ్..’ వచ్చిన మూడు నెలలకే చైతూ కొత్త సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. కృష్ణ అనే కొత్త దర్శకుడితో చైతూ చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర టైటిల్.. ఫస్ట్ లుక్ ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్లోనే కాదు.. ఫస్ట్ లుక్ లోనూ ఇంటెన్సిటీ చూపించి.. ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. చైతూ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందట ఈ చిత్రం.

అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు సంపాదించిన సాయి కొర్రపాటి ‘వారాహి చలనచిత్రం’ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజమౌళి-రమల తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇంతకుముందు ‘మనం’ సినిమాలో చైతూ ఫ్రెండుగా నటించిన లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో చైతూకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా జానర్ తెలుగు ప్రేక్షకులకు కొత్త అంటున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ ‘యుద్ధం శరణం’ సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించబోతుండటం విశేషం. తమిళ సీనియర్ నటి రేవతి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతార కార్యక్రమాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు చివర్లో విడుదల చేస్తారట. మరి ఈ సినిమాతో అక్కినేని కుర్రాడు హ్యాట్రిక్ కొట్టేస్తాడేమో చూడాలి.

Yuddham-Sharanam-First-Look

Yuddham-Sharanam-First-Look-English