Templates by BIGtheme NET
Home >> Cinema News >> తెలుగమ్మాయికి అలాంటి రోల్స్ ఎక్కువగా వస్తున్నాయా…?

తెలుగమ్మాయికి అలాంటి రోల్స్ ఎక్కువగా వస్తున్నాయా…?


పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈషా. ఈ క్రమంలో ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘మాయా మాల్’ ‘దర్శకుడు’ ‘సుబ్రహ్మణ్యపురం’ ‘బ్రాండ్ బాబు’ ‘అ!’ ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ‘రాగల 24 గంటల్లో’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించినా ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. అయితే అందంతో పాటు అభినయం కలబోసిన ఈషా రెబ్బాకు క్రేజీ ఆఫర్స్ మాత్రం రాలేదనే చెప్పాలి.

కాగా ఈషా ప్రస్తుతం పాపులర్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఇప్పటి వరకు రెబ్బా నటించిన పాత్రల కంటే ఈ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన క్యారక్టర్ భిన్నమైందని చెప్పవచ్చు. దీంతో పాటు తమిళ్ లో జీవీ ప్రకాష్ సరసన ‘ఆయిరమ్ జెన్మంగల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక కన్నడంలోనూ ‘ఎస్సార్కే’ అనే సినిమాలో కనిపించనుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో మరో న్యూ ప్రాజెక్ట్ కి సైన్ చేసిందని సమాచారం. డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించబోతున్న ఓ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా వేశ్య పాత్రలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్ లో నటించడంతో తెలుగమ్మాయికి అలాంటి రోల్స్ ఎక్కువగా వస్తున్నాయని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈషా కి మంచి రోల్స్ రావాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.