Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘పుష్ప’ పక్కన చిందులేసే ఆ బ్యూటీ ఎవరు…?

‘పుష్ప’ పక్కన చిందులేసే ఆ బ్యూటీ ఎవరు…?


Who is dance for Special Number in Allu Arjun Pushpa Movie

Who is dance for Special Number in Allu Arjun Pushpa Movie

స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు. ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అనే లెక్కలు వేస్తుంటాడు ఈ లెక్కల మాస్టర్. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తప్ప సుక్కు ప్రతి సినిమాలో ప్రత్యేక గీతం ఉంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఐటమ్ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ అవుతుంది. ఫస్ట్ సినిమా ‘ఆర్య’లో ‘అ అంటే అమలాపురం’.. జగడం సినిమాలో ’36 24 36′.. ‘ఆర్య 2’ లో ‘రింగ రింగా’.. ‘100% లవ్’ లో ‘డియాలో డియాలా’.. వన్ నేనొక్కడినే లో ‘లండన్ బాబూ లండన్ బాబూ’.. ‘రంగస్థలం’ సినిమాలో ‘జిల్ జిల్ జిగేలు రాణి’ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాగా ఈ ఐటమ్ సాంగ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”పుష్ప” సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ రెడీ చేశాడట దేవీశ్రీ. ఈ సాంగ్ లో ఆడిపాడే ఐటమ్ బాంబ్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసాడు సుక్కు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ మూవీలో ఎలాగైనా బాలీవుడ్ బ్యూటీని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒప్పించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కోసం పూజాహెగ్డే – మలైకా అరోరా – దిశా పటానీ – ఊర్వశి రౌటెలా వంటి హీరోయిన్స్ ని అనుకుంటున్నారని గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా సుక్కు ఈ సినిమాలో ‘పుష్ప’ పక్కన చిందులేయడానికి స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను ఒప్పించాలని చూస్తున్నారట. మరి ఈ ఐటమ్ సాంగ్ లో ఏ బ్యూటీ స్టెప్పులేస్తుందో చూడాలి.