ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో ఈ లిస్టింగ్‌లో కనిపించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం, 4 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 478 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1595 పాయింట్లను సాధించింది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ 15W చార్జర్‌తో పాటు రాననుంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఎన్ఎఫ్సీ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎల్ఈ వంటి ఫీచర్లు ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో లీకైన ఫొటోల ప్రకారం ఈ ఫోన్లో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉండనుంది. ఇందులో మూడు సెన్సార్లు నిలువుగా ఉండనుండగా, నాలుగో సెన్సార్ వాటి పక్కనే ఉండనుంది. వీటితో పాటు ఫ్లాష్ కూడా ఇందులో ఉండనుంది.
ఇక ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ తరహా సెల్పీ కెమెరాను అందించారు. 6.5 అంగుళాల డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. కాస్త మందమైన అంచులు ఇందులో ఉండనున్నాయి. ఈ ఫోన్ మందం 0.91 సెంటీమీటర్లు ఉండనుంది. దీని రెండర్ల ప్రకారం ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు. ఫోన్ కింద భాగంలో యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ ఉండనున్నాయి.