మహిళలు బికినీలు ధరించడం బ్యాన్ చేసిన దేశాలు ఇవే

0

విదేశాల్లో బికినీ ధరించడం సర్వ సాధారణ విషయం కదా… బికినీ ధరించి బీచ్ లో ఉంటే తప్పేంటి? అని చాలా మందికి సందేహం రావచ్చు. కానీ అన్ని విదేశాలు ఒకేలా ఉండవు. కొన్ని దేశాల్లో బికినీ ధరించడం పట్ల నిషేధం ఉంది. ఉదాహరణకు భారతదేశంలో చూసుకుంటే ఇక్కడికి వచ్చే విదేశీయులు బికినీలు ధరించి పట్టణాల్లో, వీధుల్లో తిరగరు. కానీ గోవాలోని బీచ్ లలో బికినీ ధరించిన మహిళలు చాలా మంది కనిపిస్తారు. సంస్కృతి, సాంప్రదాయాలు, పద్దతుల దృష్ట్యా కొన్ని కొన్ని ప్రదేశాల విధానాలకు తగినట్లు పర్యాటకులు ఇక్కడ నడుచుకోవడం గమనించవచ్చు. ఇలా అనుసరించే వారికి పర్యటనల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బికినీ, స్విమ్ సూట్స్ ధరించడం సౌకర్యవంతంగా భావించే వారు ఆ వస్త్రధారణకు నిషేధం ఉన్న కొన్ని దేశాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

​యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బీచ్ లు
ముస్లిం దేశాల్లో బికినీల పట్ల నిషేధం విధించడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రాస్ అల్-ఖైమా రాష్ట్రం, దాని సముద్ర తీరాల్లో పురుషులు, మహిళలు ఇద్దరూ బికినీలు లేదా ఈత దుస్తులు ధరించడం నిషేధించబడింది. కొన్ని ముస్లిం కుటుంబాలు అక్కడి బీచ్ లలో శరీర ప్రదర్శన చేసే టూరిస్టులతో కలిసి ఆనందించేందుకు ఆసక్తి చూపించరు. ఇక్కడికి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ బీచ్ లలో ఇలాంటి నిషేధం లేదు. కానీ బీచ్ లకు వెళ్లే వారికి అధికారులు ఇతర సందర్శకులకు ఇబ్బంది లేకుండా గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచిస్తుంటారు.

​బార్సిలోనా & మల్లోర్కా, స్పెయిన్
సూర్య రశ్మి అధికంగా ఉండే ఈ దేశంలో బికినీలు స్వాగతించే విషయం అని మీరు అనుకోవచ్చు. కానీ 2011లో రాజధాని నగరంలో, అనేక ద్వీపాల్లో, వీధుల్లో బికినీ ధరించి తిరగడం నిషేధించారు. ఇక్కడ బీచ్ లలో, వాటి చుట్టు పక్కల వీధుల్లో మాత్రమే తిరిగేందుకు అనుమతి ఉంది. దీనిని అతిక్రమించి టూ పీస్ బికినీ వేసుకుని తిరిగే వారికి 500 యూరోల (రూ.39 వేలు) వరకూ జరిమానా విధించబడుతుంది.

​మాల్దీవులు
అందమైన పర్యాటక గమ్యస్థానంగా మాల్దీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి విదేశీ టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పబ్లిక్ బీచ్ లలో ఈత దుస్తులు, బికినీలు ధరించడం ఇక్కడ నిషేధం. కొన్ని రిసార్ట్ బీచ్ లకు మాత్రమే ఈ దుస్తులకు అనుమతి ఉంది. ఇది ముస్లిం దేశం కావడంతో ఈ నియమాలను కఠినంగా పాటిస్తారు. అతిక్రమించిన వారు పోలీసులచే అరెస్టు కాక తప్పదు.

​హ్వార్, క్రొయేషియా
‘ది’ ద్వీపంగా పిలువబడే ఈ ప్రదేశం సెలబ్రిటీలు, ధనవంతులకు గమ్యస్థానం. ఈ ప్రాచీన పట్టణం గుండా నడిచే టూరిస్టులు చాలా గౌరవప్రదంగా ఉండాలని భావిస్తారు. బహిరంగంగా తినడం, త్రాగడంతో పాటు పర్యాటకులు షర్ట్ లేకుండా లేదా ఈత దుస్తుల్లో తిరగడం కూడా ఇక్కడ నిషేధం. దీనిని అతిక్రమించిన వారికి దాదాపు 600 యూరోల (రూ.46868లు) వరకూ జరిమానా విధిస్తారు. ‘మీ డబ్బును ఆదా చేసుకొండి… హ్వార్ ను ఆస్వాదించండి’ అనే సంకేతాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
Please Read Disclaimer