Templates by BIGtheme NET
Home >> REVIEWS >> వెంకీ మామ రివ్యూ

వెంకీ మామ రివ్యూ


నటీనటులు :  వెంకటేష్ నాగచైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా, నాజర్, ప్రకాష్ రాజ్, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, దాసరి అరుణ్ కుమార్, చమ్మక్ చంద్ర తదితరులు

దర్శకత్వం : : కె ఎస్ రవీంద్ర(బాబీ)

నిర్మాత‌లు : సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్

సంగీతం :  ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ళ

ఎడిటర్:  ప్రవీణ్ పూడి

విడుదల తేదీ : డిసెంబర్  13, 2019

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

కార్తీక్ శివరామ్ (నాగ చైతన్య) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య చేతే నష్టజాతకుడిగా పిలవబడుతున్న క్రమంలో కార్తీక్ కి తల్లితండ్రిగా మారతాడు అతని మేన మావయ్య వెంకట రత్నం (వెంకటేష్). కార్తీక్ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం కార్తీక్ హ్యాపినెస్ కోసమే త్యాగం చేస్తాడు. అది తెలిసిన కార్తీక్ ఎలాగైనా తన మామయ్య పెళ్లి చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్ పుత్)కు వెంకట రత్నం మధ్య ప్రేమ పుట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇటు వెంకట రత్నం కూడా కార్తీక్ ప్రేమించిన హారిక (రాశి ఖన్నా)ను ఒప్పించి కార్తీక్ ను హారికను కలపాలని ట్రై చేస్తాడు. అయితే అంతలో కార్తీక్ జీవితానికి సంబంధించి వారికి ఒక నిజం తెలుస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని ఊహించని పరిణామాల అనంతరం కార్తీక్ తన మామయ్యకు శాశ్వతంగా దూరమయిపోవటానికి ఆర్మీలోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన మామయ్యకి ఎందుకు దూరం అవ్వాలనుకున్నాడు? ఇంతకీ కార్తీక్ జీవితానికి సంబంధించిన నిజం ఏమిటి? ఈ మధ్యలో కార్తీక్ ఆర్మీ నుండి ఎలా మిస్ అయిపోతాడు? కార్తీక్ కోసం వెంకట రత్నం ఏమి చేశాడు? కార్తీక్ ను ఎలా కనిపెట్టాడు? చివరికి వాళ్లిద్దరూ ఒకటయ్యారా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘వెంకీ మామ’లో డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు గుడ్ ఎమోషన్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ – రాశి ఖన్నాల మధ్య కామెడీ సీన్స్, అలాగే చైతు – పాయల్ మధ్య ట్రాక్ మరియు మిగిలిన సెటప్ లో భాగంగా వచ్చే సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే ఇంటర్వెల్ లోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఈ మధ్య కాలంలో తన మ్యూజిక్ తో సంచలనం సృష్టిస్తోన్న తమన్ ఈ సినిమాకి అందించిన సంగీతం కూడా బాగుంది. మరియు హీరోల మధ్య కెమిస్ట్రీ అండ్ ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంటాయి.

ఇక వెంకట రత్నం అనే పాత్రలో వెంకటేష్ తన పాత్రకు తగ్గట్లు… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాయల్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో వెంకీ అద్భుతంగా నటించాడు. అలాగే మేనల్లుడిగా కనిపించిన నాగచైతన్య కూడా బాగా నటించాడు.

హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా – పాయల్ లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన రావు రమేష్, తాతయ్యగా నాజర్ ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు బాబీ రాసుకున్న కామెడీ ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆర్మీ సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ప్లే ఆసక్తికరంగా సాగదు. అలాగే మామఅల్లుళ్ళు వీడిపోవటానికి కారణమైన పాయింట్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా.. ఆ డ్రామాని ఇంకా బలంగా రాసుకొని ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.

మొత్తంగా దర్శకుడు మంచి కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. కొన్ని సన్నివేశాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో చైతు పాత్రకి సంబదించిన ట్రాక్ ఇంకా ఎఫక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం:

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, ఆసక్తికరంగా సాగని కొన్ని సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. విలేజ్ సన్నివేశాల్లోని విజువల్స్ ను కెమెరామెన్ చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

తీర్పు:

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలయికలో వచ్చిన ఈ ఎమోషనల్ క్రేజీ మల్టీస్టారర్.. సరదాగా మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా బాగానే ఆకట్టుకుటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అవ్వడం, మొయిన్ గా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ స్ లో వచ్చే సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు లేకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఐతే వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో బాగా అలరించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

 

వెంకీ మామ : లైవ్ అప్డేట్స్

  • ఓ చక్కటి క్లైమాక్స్ తో చిత్రం పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

  • ఇప్పుడు వెంకీ మరియు చైతూల మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.

  • చైతు ఆర్మీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగిసాక ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.

  • చైతూకి సంబంధించి హై వోల్టేజ్ ఆర్యఆర్మీ ఎపిసోడ్స్ ఇప్పుడు వస్తున్నాయి.అలాగే మరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయింది.

  • ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.వెంకీ చైతూను కలవడానికి కాశ్మిర్ వెళ్ళుతున్నారు.

  • ఇప్పుడు వెంకీ మరియు చైతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యి పెరుగుతున్నాయి.ఆసక్తికర డ్రామా నెలకొంది.

  • నలుగురు ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాల అనంతరం కలర్ ఫుల్ మాస్ బీట్ కోకాకోలా పెప్సీ సాంగ్ మొదలయ్యింది.

  • ఇంటర్వెల్ అనంతరం ఆర్మీ క్యాప్ తో స్టార్ట్ అయ్యింది.ఇప్పుడు వెంకీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న చైతూని కలవడానికి వెళ్తున్నాడు.ఇప్పుడు మరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యింది.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పర్వాలేదనిపించే కథనంతో సాగింది.అలాగే ఇంటర్వెల్ పాయింట్ సెకండాఫ్ లో మరింత బలమైన ఫ్యామిలీ డ్రామాగా మలిచే విధంగా మారిందని చెప్పొచ్చు.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

  • ఒక ఆసక్తికర ట్విస్ట్ తో చిత్రం సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.

  • ఇప్పుడు చిత్రం హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ దిశగా వెళ్తుంది.

  • ఇప్పుడు వెంకీ,చైతు,రాశి మరియు నాజర్,రావు రమేష్ ల మధ్య కొన్ని ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు వెంకీ మరియు పాయల్ మధ్య రెట్రో క్లాసిక్ సాంగ్ ఎన్నాళ్ళకో పాట మొదలయ్యింది.

  • చిత్రం గతానికి ప్రస్తుతానికి అటు ఇటుగా మారుతూ వస్తుంది.ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో నాలుగురు ప్రధాన పాత్రధారుల మధ్య పై కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు చిత్రం మళ్ళీ ప్రస్తుత రోజుకు చేరుకుంది.కాశ్మిర్ లో కొన్ని మిలట్రీ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.మేజర్ జైదేవ్ గా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.

  • ఇప్పుడు చై మరియు రాశీ ఖన్నాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది.ఇందులో ఇద్దరి మధ్య ఇప్పుడు నువ్వు నేను సాంగ్ మొదలయ్యింది.

  • అదే గ్రామంలో ఓ హిందీ టీచర్ గా పాయల్ రాజ్ పుత్ ఇప్పుడే ఎంటర్ అయ్యింది.

  • ఇప్పుడు రాశీ ఖన్నా ఎంటర్ అయ్యింది.ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చై మరియు రాశి కు ఏదో విషాద లవ్ ట్రాక్ ఉన్నట్టు అనిపిస్తుంది.ఇప్పుడు రావు రమేష్ మరియు దాసరి అరుణ్ కుమార్ లు సీన్ లో జాయిన్ అయ్యారు.

  • ఇప్పుడు సినిమా మరో మూడేళ్లు వెనక్కి వెళ్ళింది.ఇక్కడ కార్తీక్ గా నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు సూపర్ హిట్ ట్రాక్ “వెంకీ మామ” సాంగ్ వస్తుంది.

  • ఇప్పుడు టైటిల్ పూర్తయ్యి ప్రస్తుత రోజుకు సినిమా చేరుకుంది.ప్రస్తుతం కాశ్మీర్ లోని ఓ టెర్రరిస్ట్ దాడుల సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఓ జ్యోతిస్కునిగా సీనియర్ నటులు నాజర్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు కథనంలో విక్టరీ వెంకటేష్ ఒక ఎమోషనల్ ఎంట్రీతో పరిచయం అయ్యారు.

  • ఇప్పుడు 1993వ సంవత్సరం.ఒక గ్రామంలోని అందమైన గుడి దగ్గర సన్నివేశాలతో చిత్రం మొదలయింది.

  • హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

నటీనటులు :  వెంకటేష్ నాగచైతన్య, పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా, నాజర్, ప్రకాష్ రాజ్, విద్యుల్లేఖ రామన్, రావు రమేష్, దాసరి అరుణ్ కుమార్, చమ్మక్ చంద్ర తదితరులు దర్శకత్వం : : కె ఎస్ రవీంద్ర(బాబీ) నిర్మాత‌లు : సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్ సంగీతం :  ఎస్ ఎస్ థమన్ సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ళ ఎడిటర్:  ప్రవీణ్ పూడి విడుదల తేదీ : డిసెంబర్  13, 2019 విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ: కార్తీక్ శివరామ్ (నాగ చైతన్య) చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య చేతే నష్టజాతకుడిగా పిలవబడుతున్న క్రమంలో కార్తీక్ కి తల్లితండ్రిగా మారతాడు అతని మేన మావయ్య వెంకట రత్నం (వెంకటేష్). కార్తీక్ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం కార్తీక్ హ్యాపినెస్ కోసమే త్యాగం చేస్తాడు. అది తెలిసిన కార్తీక్ ఎలాగైనా తన మామయ్య పెళ్లి చెయ్యాలనే ఉద్దేశ్యంతో స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్ పుత్)కు వెంకట రత్నం మధ్య ప్రేమ పుట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇటు వెంకట రత్నం కూడా కార్తీక్ ప్రేమించిన హారిక (రాశి ఖన్నా)ను ఒప్పించి కార్తీక్ ను హారికను కలపాలని ట్రై చేస్తాడు. అయితే అంతలో కార్తీక్ జీవితానికి సంబంధించి వారికి ఒక నిజం తెలుస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని ఊహించని పరిణామాల అనంతరం కార్తీక్ తన మామయ్యకు శాశ్వతంగా దూరమయిపోవటానికి ఆర్మీలోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన మామయ్యకి ఎందుకు దూరం అవ్వాలనుకున్నాడు? ఇంతకీ కార్తీక్ జీవితానికి సంబంధించిన నిజం ఏమిటి? ఈ మధ్యలో కార్తీక్ ఆర్మీ నుండి ఎలా మిస్ అయిపోతాడు? కార్తీక్ కోసం వెంకట రత్నం ఏమి చేశాడు? కార్తీక్ ను ఎలా కనిపెట్టాడు? చివరికి వాళ్లిద్దరూ ఒకటయ్యారా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘వెంకీ మామ’లో డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు గుడ్ ఎమోషన్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ – రాశి ఖన్నాల మధ్య కామెడీ సీన్స్, అలాగే చైతు – పాయల్ మధ్య ట్రాక్ మరియు మిగిలిన సెటప్ లో భాగంగా వచ్చే సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే ఇంటర్వెల్ లోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఈ మధ్య కాలంలో తన మ్యూజిక్ తో సంచలనం సృష్టిస్తోన్న తమన్ ఈ సినిమాకి అందించిన సంగీతం కూడా బాగుంది. మరియు హీరోల మధ్య కెమిస్ట్రీ అండ్ ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇక వెంకట రత్నం అనే పాత్రలో వెంకటేష్ తన పాత్రకు తగ్గట్లు… తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాయల్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో వెంకీ అద్భుతంగా నటించాడు. అలాగే మేనల్లుడిగా కనిపించిన నాగచైతన్య కూడా బాగా నటించాడు. హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా – పాయల్ లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన రావు రమేష్, తాతయ్యగా నాజర్ ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు. మైనస్ పాయింట్స్: దర్శకుడు బాబీ రాసుకున్న కామెడీ ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆర్మీ సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ప్లే ఆసక్తికరంగా సాగదు. అలాగే మామఅల్లుళ్ళు వీడిపోవటానికి కారణమైన పాయింట్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా.. ఆ డ్రామాని ఇంకా బలంగా రాసుకొని ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. మొత్తంగా దర్శకుడు మంచి కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. కొన్ని సన్నివేశాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో చైతు పాత్రకి సంబదించిన ట్రాక్ ఇంకా ఎఫక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది. సాంకేతిక విభాగం: ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, ఆసక్తికరంగా సాగని కొన్ని సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి…

వెంకీ మామ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.3

వెంకీ మామ రివ్యూ

వెంకీ మామ రివ్యూ

User Rating: Be the first one !
3