చిరు ‘వేదాళం’లో బిగ్ బాస్ కంటిస్టెంట్.. మెగాస్టార్ ప్రకటన..

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే ప్రతీ కంటిస్టెంట్ రెండు లక్ష్యాలతో ఉంటారు. టైటిల్ దక్కించుకోవడం ఒకటైతే.. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకోవడం మరోటి. అయితే.. టైటిల్ ఎవరో ఒక్కరే దక్కించుకుంటారు. కానీ.. పాపులారిటీ డ్రా చేసే అవకాశం అందరికీ ఉంటుంది. ఆ ఫేమ్ ను తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఉపయోగించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. వీరిలో కొందరి ఆశలు ఫలిస్తుంటాయి కూడా.. తాజాగా ముగిసిన బిగ్ బాస్ 4 సీజన్ కంటిస్టెంట్ దివి వధ్య ఊహించని అవకాశం దక్కించున్నాారని సమాచారం. […]

మెగాస్టార్ తో `సామ్ జామ్` డబుల్ ఫన్నీ ట్రీట్..

ఆహా-ఓటీటీ వేదికపై `సామ్ జామ్` కార్యక్రమం పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే. అక్కినేని కోడలు హోస్టింగ్ ఎంతో ప్రత్యేకంగా ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే రానా-విజయ్ దేవరకొండ- తమన్నా లాంటి స్టార్లతో సామ్ జామ్ ఎపిసోడ్స్ రక్తి కట్టించాయి. సమంత తెలివైన ఫన్నీ ప్రశ్నలతో అద్భుతంగా హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షో డిజిటల్ వేదికపై పెద్ద హిట్. ఈసారి క్రిస్మస్ స్పెషల్ గా సామ్ జామ్ మరింత రంజింపజేయనుంది. అయితే ఈసారి అతిథి ఎవరు? అంటే.. ఇండస్ట్రీ […]

సీనియర్ జర్నలిస్టుని పరామర్శించిన మెగాస్టార్

తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆయన కోలుకుని తిరిగి యథావిధిగా మారాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్సను అందించే ఏర్పాటు చేశారు. […]

మెగాస్టార్ ‘బైరెడ్డి’ గా రాబోతున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ముందుగా ఈ రీమేక్ బాధ్యతలు యువ దర్శకుడు సుజీత్ కి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ […]

మెగాస్టార్ ని మెప్పించలేకపోతున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. తర్వాత చేయబోయే మూడు ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో చిరు నటించనున్నాడు. అలానే మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ లో కూడా మెగాస్టార్ లైన్ లో పెట్టాడు. వీటితోపాటు బాబీ (కేఎస్ […]

సామ్ జామ్ 2వ ఎపిసోడ్ మెగాస్టార్ తో కాదా?

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సామ్ జామ్ మొదటి ఎపిసోడ్ కు ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. దాంతో రెండవ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిరంజీవిని రంగంలోకి దించారు. ఇటీవలే చిరంజీవి మరియు సమంతలు సామ్ జామ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. చిరంజీవి సామ్ జామ్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తదుపరి ఎపిసోడ్ రానా […]

మెగాస్టార్ 153 ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిది నెలల తర్వాత ఈనెల 9వ తారీకు నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు అధికారికంగా డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకు ముందుతో పోల్చితే ఈసారి షెడ్యూల్ ను కుదించి తక్కువ రోజుల్లోనే సినిమాను షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లోనే ఆచార్యకు గుమ్మడి కాయ […]

మెగాస్టార్ షో పై ఎఫ్ఐఆర్ నమోదు.. నిషేదంకు డిమాండ్

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ నిర్వహించే రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం 12వ సీజన్ జరుగుతోంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఈ సీజన్ మొదలు అయ్యింది. ఈ షో ప్రతి సీజన్ కూడా వార్తల్లో ఉంటూనే వస్తుంది. అయితే ఈసారి ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. అందులో అడిగిన ఒక ప్రశ్న కారణంగా షో నిర్వాహకులు మరియు అమితాబచ్చన్ పై కేసు నమోదు అయ్యింది. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా […]

8 నెలల తర్వాత రెడీ అవుతున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతుంది. మార్చి నెలలో కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను దాదాపు 8 నెలల తర్వాత పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవి వయసు రీత్యా ఈ సినిమా షూటింగ్ ను ఇన్నాళ్లు ఆపాల్సి వచ్చిందని టాక్. ఇప్పటికే స్టార్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు పలువురు స్టార్స్ షూటింగ్ లను ప్రారంభించారు. చిరంజీవి మాత్రం […]

హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై మెగాస్టార్ స్పందన

సీనియర్ హీరో రాజశేఖర్ కోవిడ్ 19 కి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె శివాత్మిక తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని చెప్పడంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కోవిడ్ తో నాన్న పోరాటం చాలా కష్టంగా మారింది. మీ ప్రార్థనల ప్రేమ మమ్మల్ని రక్షిస్తాయని ఆశిస్తున్నాను! అనడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే ఆ తర్వాత రాజశేఖర్ ఆరోగ్యంపై ఇతర కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించడంతో […]

ప్రభుదేవా లారెన్స్ తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ కోసం మెగాస్టార్ సెర్చ్?

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. ది గ్రేట్ రాఘవ లారెన్స్ మాస్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆ ఇద్దరి కెరీర్ జర్నీకి అవసరమైన బూస్టప్ ఇచ్చింది చిరునే. ఈ విషయాన్ని ఆ ఇద్దరూ చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా చిరంజీవి ది బెస్ట్ కొరియోగ్రాఫర్లను వెతికి పట్టుకునేవారు. ఆ క్రమంలోనే ప్రభుదేవా.. లారెన్స్ వంటి యంగ్ ట్యాలెంట్ ను అప్పట్లో ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా.. లారెన్స్ మాస్టార్ […]

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ మూవీ…?

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత రెండు రీమేక్ చిత్రాల్లో నటించనున్నారు. వాటిలో ఒకటి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ తెలుగు రీమేక్ కు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు చిరు. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించింది. సిస్టర్ […]

మెగాస్టార్ ను ఆశీర్వదిస్తున్న అల్లువారు

నేడు లెజెండ్రీ కమెడియన్ కమ్ ఫిల్మ్ మేకర్ అల్లు రామలింగయ్య 99వ జయంతి. ఈ సందర్బంగా ఆయనతో అనుబంధం ఉన్న అందరు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అల్లు కుటుంబ సభ్యులు నేడు ఆయన జయంతి సందర్బంగా అల్లు స్టూడియోస్ ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అల్లు అర్జున్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అల్లు వారి అల్లుడు అయిన మెగాస్టార్ చిరంజీవి […]

మెగాస్టార్ అతనిపై అంత నమ్మకం పెట్టుకున్నాడా…?

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ”వేదలమ్” చిత్రాన్ని వీరు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చిరు భావించాడట. అయితే చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కోసం మెహర్ రమేష్ ని డైరెక్టర్ ఎంచుకోవడం మెగా అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మెహర్ […]

మిలియన్ మార్క్ ని అందుకున్న మెగాస్టార్…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ లో సోషల్ మీడియా మాధ్యమాలలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి ట్విట్టర్ – ఫేస్బుక్ – ఇన్స్టాగ్రామ్ లలో ఖాతాలు ఓపెన్ చేశారు చిరంజీవి. అయితే మెగాస్టార్ రావడం లేట్ అయినా సోషల్ మీడియాలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. నిజానికి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో చాలా తక్కువ మంది టాప్ స్టార్స్ మాత్రమే రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో […]

‘గుండు బాస్’ గా బిగ్ బాస్.. మెగాస్టార్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే…!

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య తన లుక్స్ తో వేరియేషన్స్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం స్లిమ్ గా మారిన చిరంజీవి.. ఇటీవల క్లీన్ షేవ్ లో మీసాలు లేకుండా కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యపరిచాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసి మరోసారి షాక్ ఇచ్చాడు మెగాస్టార్. అయితే ఈ లుక్ మాత్రం ఎవరూ ఉహించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి ఈ ఫొటోలో గుండుతో కనిపిస్తున్నాడు. […]

గారాల మనుమరాలిని ముద్దు చేస్తున్న మెగాస్టార్…!

మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లల పట్ల ఎంతటి ఆప్యాయతను చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు అనేక సందర్భాల్లో మెగా కాంపౌండ్ లోని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన విషయాలు షేర్ చేసుకున్నారు. ఇటీవల తన మనుమరాలు.. శ్రీజా – కళ్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె నవిష్కతో చిరు సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. నవిష్కను చిరు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ‘మిమీ మిమ్మి’ అంటూ గారాభం చేసిన వీడియో […]

మెగాస్టార్ బర్త్ డే .. మెగా హీరోలు శుభాకాంక్షలు

ప్రతిసారీ బర్త్ డే వేరు.. ఈసారి వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున చిరంజీవి కూడా ఈ సంవత్సరం వేడుకలను సాధా సీదా ఎఫైర్ గా ఉంచాలని అభిమానులను కోరారు. మహమ్మారి సమయంలో తన పుట్టినరోజును బైక్ ర్యాలీలతో జరుపుకోవద్దని.. కేకులు కట్ చేయాలంటే కోవిడ్ నియమాలు పాటించాలని అభిమానులను కోరారు మెగాస్టార్ చిరంజీవి. అయితే అభిమానులు బాస్ ఆజ్ఞను శిరసా వహించి అన్ని నియమాలు పాటిస్తూనే బర్త్ డే వేడుకలు […]

మెగాస్టార్ బర్త్ డే సీఎంపీని రిలీజ్ చేసిన 100 మంది సెలబ్రిటీలు..!

మెగాస్టార్ చిరంజీవి రేపు తన 65వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది చిరంజీవి బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు మెగా అభిమానులు. ఈ నేపథ్యంలో #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ తో ట్వీట్స్ పెడుతూ ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా ఈ మధ్య ట్రెండ్ గా మారిన కామన్ డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే […]

చిరు – మణి కాంబో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుందా…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొరటాల శివ స్టైల్ లో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లోనూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో చిరుకి జోడీగా కాజల్ […]