బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు!

0

అక్రమార్కులు మనదేశంలోనే కాదు.. అన్ని చోట్ల ఉన్నారు. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటూ ప్రభుత్వాలకు సవాలు విసురుతుంటారు. పెరూ దేశంలోని అమెజాన్ చిత్తడి అడవులు బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ కొందరు అనుమతులు తీసుకొని బంగారాన్ని తవ్వుతుంటారు. ఈ బంగారు గునుల్లో పనిచేస్తూ ఎందరో కార్మికులు జీవనోపాధి కూడా పొందుతుంటారు. అయితే అమెజాన్ అడవుల్లోని బంగారంపై అక్రమార్కులు కన్నేశారు. అడవిలోని కొద్ది ప్రాంతానికి మాత్రమే వాళ్లు అనుమతులు తీసుకుంటారు. ఈ తర్వాత విచ్చలవిడిగా బంగారాన్ని తవ్వేసుకొని సొమ్ముచేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగే అక్రమాలను నాసా బయటపెట్టింది.

పెరూలోని అమెజాన్ అడవుల్లో బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు చూస్తే మనకు కనిపిస్తుంది. ఈ చిత్రంలో కనిపించే నదుల్లాంటి ప్రాంతమంతా బంగారం కోసం తవ్విందే. సాధారణంగా బంగారం తవ్వే వాళ్లు నాసాకు చిక్కకుండా బంగారం తవ్వకాలు జరిగే ప్రాంతాలు ఆకాశం నుంచి కనిపించకుండా దాచేస్తారు. సూర్యుడి వెలుతురు ప్రతిబింబించేలా ఆ గుంటల్లో నీళ్లు నింపి శాటిలైట్ ఫొటోలకు చిక్కకుండా చేస్తారు. వ్యోమగామి ఈ ఫొటోలను గుర్తించారు. ఇక్కడ బంగారం అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన నిర్ధారించారు.

ఆగ్నేయ పెరూలోని మాడ్రే డీ డియోస్ ప్రాంతంలో బంగారం తవ్వకాల వల్ల అడవుల్లో జరుగుతున్న విధ్వంసానికి ఈ ఫొటోలు నిదర్శనంగా నిలిచాయి. ఇక్కడ బంగారం కోసం తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో ఏర్పడిన గుంటలు నీళ్లతో నిండిపోయి పైకి కొన్ని వందల పళ్లాల్లా కనిపిస్తున్నాయి. ఆ తవ్వకాలు జరిగే చుట్టుపక్కల చెట్లను కూడా భారీగా కొట్టేశారు.