పద్మ అవార్డులపై మోడీ కీలక ప్రకటన

0

ఎప్పుడూ మేధావులు ప్రజలకు తెలిసిన పాపులర్ వ్యక్తులే కాదు.. సాధారణ ప్రజల్లో మెలిగే అసాధారణ ప్రతిభావంతులు కూడా ఉంటారు. కానీ వారికి సరైన గుర్తింపు గౌరవం దక్కదు. అలాంటి వారు ఉంటే చెప్పాలని.. వారికి పద్మ అవార్డులతో సత్కరిద్దామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.

పద్మ అవార్డుల కోసం అసాధారణమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలను మోడీ కోరారు.

దేశంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నాయని మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అట్టడుగున అసాధారణమైన పనిచేస్తున్నారన్నారు. అయితే వారి గురించి ఎక్కువగా తెలియదన్నారు. అలాంటి వారిని పద్మ అవార్డుల కోసం నామినేట్ చేయాలని మోడీ కోరారు.

పద్మ అవార్డుల కోసం నామినేట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నామని మోడీ తెలిపారు. ఈ మేరకు www.padmaawards.gov.inకు తమ నామినేషన్లు పంపాలని ఆయన కోరారు.

పద్మ పురస్కారాల పేరుతో పద్మ విభూషణ్ పద్మ భూషణ్ పద్మ శ్రీ అవార్డులను కేంద్రం అందిస్తోంది. కొన్నేళ్లుగా సమాజానికి జీవితాంతం చేసిన కృషితోపాటు పలు రంగాల్లో సాధించిన విజయాలకు మోడీ ప్రభుత్వం ఈ పద్మ అవార్డులను అందిస్తోంది.

1954లో పద్మ అవార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా ఈ అవార్డులను కేంద్రప్రభుత్వం దేశంలోని ప్రతిభావంతులకు ప్రధానం చేస్తుంది.