Templates by BIGtheme NET
Home >> Telugu News >> వీర్రాజు గాలి తీసేసిన వైసీపీ ఎంపి

వీర్రాజు గాలి తీసేసిన వైసీపీ ఎంపి


అమరావతి రాజధాని మార్పు అంశంలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు గాలి తీసేశారు. విశాఖపట్నంలో ఎంపి మాట్లాడుతూ మూడు రాజధానుల అంశాన్ని ఎవరితో మాట్లాడలో వారితోనే మాట్లాడేసినట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతే రాజధానిగా ఉంటుందన్ని వీర్రాజు చెప్పారు. మూడు రాజదానులు ఉండకూడదన్నదే తమ ఉద్దేశ్యమంటు వీర్రాజు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ముందు వీర్రాజు అమరావతిలో ప్రకటన చేయటం తర్వాత ఎంపి వైజాగ్ లో ప్రకటన చేయటంతో రాజకీయంగా వేడి మొదలైంది. ఎంపి ప్రకటన చేసిన దగ్గర నుండి అమరావతిలో ఉద్యమం చేస్తున్న జనాలు కూడా వీర్రాజు స్టేట్మెంట్ ను నమ్మటంలేదట. ఎందుకంటే ఇదే వీర్రాజు అధ్యక్షుడైన కొత్తల్లో మూడు రాజధానులకు జై కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే రాజధానుల ఏర్పాటన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఇష్టంపైనే ఆధారపడుటుందని కూడా చెప్పారు.

ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని అంశంతో తమకెటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంగా మూడుసార్లు కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. కేంద్రం అఫిడవిట్లతో వీర్రాజు ప్రకటన వీగిపోయింది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి తాజా ప్రకటనకు కేంద్రం అఫిడవిట్లు మద్దతుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో అమరావతికి మద్దతుగా వీర్రాజు ఎన్ని ప్రకటనలు చేసినా ఉపయోగం లేకపోతోంది.

విచిత్రమేమిటంటే తిరుపతి వైజాగ్ అనంతపురం జిల్లాల పర్యటనల్లో ఎక్కడ వీర్రాజు రాజధాని అంశంపై మాట్లాడలేదు. రాజధానిపై అమరావతిలో చేసిన ప్రకటన తర్వాత ఇతర ప్రాంతాల్లో పర్యటించినపుడు కూడా ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. అంటే అమరావతి విషయంలో వీర్రాజు కూడా ఎన్ని డ్రామాలాడాలో అన్నీ ఆడుతున్నట్లు ఉద్యమకారులకు అర్ధమైపోయిందట. దాంతో అమరావతిపై వీర్రాజు గాలి వైసీపీ ఎంపి తీసేసినట్లయ్యింది.