దర్శకేంద్రుడి సమర్పణలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

0

‘ఈ నగరానికి ఏమైంది’ ఫేం సుశాంత్ హీరోగా ఛాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా రూపొందిన ‘బొంభాట్’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మించిన ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పిస్తున్నాడు. ఆయన సమర్పణతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే లో సలహాలు సూచనలు దర్శకేంద్రుడు ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అందువల్ల సినిమా కోసం ఒక వర్గం వారు వెయిట్ చేస్తున్నారు.

థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు. ఎప్పటి వరకు చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయో తెలియదు. అందుకే థియేటర్ల కోసం వెయిట్ చేయడం మానేసి ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారంటూ మీడియా సర్కిల్స్ ద్వారా ప్రచారం జరుగుతోంది. నిర్మాత విశ్వాస్ మాట్లాడుతూ మా కథ నచ్చి సమర్పించేందుకు ఒప్పుకున్నందుకు దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు అంతా వ్యక్తం చేశారు.