Templates by BIGtheme NET
Home >> Cinema News >> క్లాస్ ఆఫ్ ’83’ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా…!

క్లాస్ ఆఫ్ ’83’ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా…!


బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ”క్లాస్ ఆఫ్ ‘83” అనే చిత్రంతో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో సయ్యద్ యూనస్ హుస్సేన్ జైదీ రచించిన ‘ది క్లాస్ ఆఫ్ 83’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘క్లాస్ ఆఫ్ ‘83’ కి అతుల్ సభర్వాల్ దర్శకత్వం వహించారు. కరోనా సమయంలో అన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. నాసిక్ పోలీస్ అకాడమీలో ఇన్స్ట్రుక్టర్ గా నియమించబడిన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ సింగ్(బాబీ డియోల్).. ఐదుగురు విప్లవ భావాలు కలిగిన యువకులను గుర్తించి వారిని ట్రైన్ చేసి వారిని ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా తయారు చేస్తాడు. ఇలా వారిని ట్రైన్ చేయడానికి కారణమేంటి? దీని వెనుక ఉన్న వ్యక్తి వీరికి ఇచ్చిన మిషన్ ఏమిటి? ఈ ఐదుగురు యువ పోలీసులు ఏం చేసారు? అనేదే ఈ ”క్లాస్ ఆఫ్ ‘83” స్టోరీ.

కాగా ‘దారి తప్పిన వ్యవస్థని ఆర్డర్ లో పెట్టడానికి కొన్నిసార్లు చట్టాన్ని కూడా అతిక్రమించాల్సి వస్తుంది’ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకి సరైన కథనం లేకపోవడం.. అలాగే క్లైమాక్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో కాస్త నిరాశపరిచే అంశం. డైరెక్టర్ ఒక పవర్ ఫుల్ కంటెంట్ ను తీసుకున్నా తెరకెక్కించిన విధానం ఇంకా బెటర్ గా ఉండాలని ఓటీటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లీడ్ రోల్ లో నటించిన బాబీ డియోల్ మంచి నటన కనబరిచారు. మిగతా ప్రధాన పాత్రల్లో కనిపించిన అనూప్ సోనీ – జాయ్ సేన్ గుప్తా – విశ్వజీత్ ప్రధాన్ – భూపేంద్ర – హితేష్ భోజ్ రాజ్ – సమీర్ పరాంజపే తమ పరిధి మేరకు నటించారు. ఇక ముంబై అండర్ వరల్డ్ మరియు లోకల్ డాన్స్ ను చూపిన విధానం రియలిస్టిక్ గా అనిపించింది. ఇక విజు షా సంగీతం.. మారియో పొల్జాక్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం మీద రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడే వారు కరోనా డేస్ లో ఒకసారి చూసి ఎంజాయ్ చేసే మూవీ ”క్లాస్ ఆఫ్ ‘83” అని చెప్పవచ్చు.