మెగాస్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి అంతా నిరాశేనా?

0

ఆగస్టు 22 బిగ్ డే .. మెగా డేగా డిక్లేర్డ్. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకత ఏమిటో మెగాభిమానులకు ఎంతమాత్రం గుర్తు చేయాల్సిన పని లేదు. సంవత్సరం అంతా ఆ ఒక్క రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే వీరాభిమానులు ఉన్నారు. దశాబ్ధాల పాటు మెగాస్టార్ చిరంజీవి ఈ ఛరిష్మాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ కి అన్నయ్యగా ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈసారి ఆ ముఖ్యమైన తేదీ రానే వచ్చింది. ప్రతిసారీ బర్త్ డే వేడుకలు అంటే నెలరోజుల ముందు నుంచే బోలెడంత సందడి ఉండేది. కానీ ఈసారి కోవిడ్ వల్ల ఆ సందడి సోషల్ మీడియాల వరకే పరిమితమైంది.

బిగ్ డే రోజున అభిమానులకు చిరు-కొరటాల బృందం ఎలాంటి కానుక ఇవ్వబోతున్నారు? కొరటాల ఆచార్య టీజర్ ని లాంచ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారని ప్రచారమైంది కదా? అని ప్రశ్నిస్తే దీనికి ఔననే సమాధానం రానే లేదు. నిజానికి ఈసారి బర్త్ డే కి ఆశించినంత పెద్ద అప్ డేట్ ఏదీ ఉండబోదు. కేవలం టైటిల్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేస్తారు. అలాగే మెగాస్టార్ లుక్ కి సంబంధించిన మోషన్ టీజర్ ని లాంచ్ చేసే వీలుందని తెలిసింది.

నిజానికి ఆచార్య టీజర్ ని అదిరిపోయే రేంజులో మెగాభిమానులకు చూపించాలని కొరటాల ప్లాన్ చేసినా చిరు దానికి ససేమిరా అనేశారట. దీంతో కొరటాల వేరే ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సగం పైగా షూటింగ్ పూర్తయినా కనీసం టీజర్ అయినా చూపించకపోతే అభిమానులకు నిరాశ తప్పదు. టైటిల్ పరంగా సస్పెన్స్ ఏదీ లేదు కాబట్టి ఇక కొత్తగా తెలిసేదీ ఏదీ లేదు. కేవలం మోషన్ పోస్టర్ టీజర్ తో సరిపుచ్చుకోవాల్సిందేనా? అంటూ అభిమనుల్లో నిరాశ కనిపిస్తోంది. అలా కాకుండా కొరటాల రెడీ చేయించిన టీజర్ ని వదిలేస్తేనే బావుంటుందన్న ఆత్రుత అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే చిరు మాత్రం టీజర్ ట్రైలర్ ప్రతిదీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాకే అని కొరటాలకు చిరు చెప్పారట. దీంతో ప్లాన్ ఛేంజ్ చేశారన్నమాట.