Templates by BIGtheme NET
Home >> Cinema News >> అల్లుడితో దేవి మ్యూజికల్ వీక్

అల్లుడితో దేవి మ్యూజికల్ వీక్


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ అను ఎమాన్యూల్ హీరోయిన్స్ గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాట విడుదల అయ్యి ఉంది. ఇంకా నాలుగు పాటలను రోజుకు ఒకటి చొప్పున విడుదల చేయబోతున్నట్లుగా దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నాడు. అల్లుడు అదుర్స్ మ్యూజికల్ వీక్ అంటూ వరుసగా పాటలను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సినిమా సందడి చేయబోతున్నారు.

నేడు సినిమా నుండి రెండవ పాట పడిపోయా పాటను విడుదల చేయబోతున్నారు. నేడు సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఐటెం సాంగ్ లో మోనాల్ గజ్జర్ తో కలిసి బెల్లంకొండ స్టెప్పులు వేశాడు. దేవిశ్రీ మార్క్ తో ఈ ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు సంక్రాంతి రేసులో లేదు. దాంతో పాటల విడుదల విషయంలో తాపీగా ఉన్నారు. కాని విడుదల తేదీ హడావుడిగా ప్రకటించడంతో పాటలను వరుసగా విడుదల చేయాల్సి వచ్చింది. రోజుకు ఒక పాట చొప్పున విడుదల చేసి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇలా కూడా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది.