కుర్ర హీరోయిన్ నిరీక్షణ ఎవరికోసమో

0

ఈషా రెబ్బ ..పక్కాగా తెలుగమ్మాయి. హైదరాబాద్ ఇండస్ట్రీలో చాలా మంది తెలుగమ్మాయిల్ని ప్రోత్సహించాలి అని ఎంత మైకుల ముందు చెప్పినా ప్రాక్టికల్ గా వచ్చేసరికి ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ భామల్ని దిగమతి చేసేస్తున్నారు. ఇక మల్లూ భామల దండయాత్ర గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. దాని వల్ల ఎంతో టాలెంట్ వున్న తెలుగమ్మాయిలు అవకాశాలు లేక నిరాశగానే ఎదురుచూడాల్సిన పరిస్థితి.

ఈషా రెబ్బ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మడికట్టుకు కూచుంటే అవకాశాలు రావని పసిగట్టుకు కూచున్న ఇషా.. ఇటీవల మారింది కానీ.. ఇంతకుముందు తాను కూడా అలాంటి బ్యాక్ లాగ్ సన్నివేశం ఎదుర్కొంది. తెలుగమ్మాయి కావడంతో ఎంత టాలెంట్ వున్నా.. గ్లామర్ ప్రదర్శనకు సిద్ధమనే సంకేతాల్ని అందించినా ఆమెకు సరైన అవకాశాలు దక్కలేదు. ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత`లో అవకాశం లభించినా అది పేరుకు మాత్రమే పరిమితం కావడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తనకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం కోసం నిరీక్షిస్తోంది.

ప్రస్తుతం ఈషా రెబ్బా నెట్ ఫ్లిక్స్ కోసం `లస్ట్ స్టోరీస్` తెలుగు వెర్షన్ లో నటించింది. ఇందులో గ్లామర్ ఎలివేషన్ తో పాటు హాట్ సీన్లలో రెచ్చిపోయిందట. దీంతో ఆమె కెరీర్ కొత్త మలుపు తిరగడం ఖాయం అంటున్నారు. దీనితో పాటు అఖిల్ నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఈషా చేతిలో వున్న ఒకే ఒక్క క్రేజీ మూవీ ఇది. పలువురు మేకర్స్ తో మంతనాలు సాగించినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.