హన్సిక ఒంటిపై నూలు పోగు లేదు పైగా చేతులపై రక్తపు మరకలు.. అసలేం జరిగింది? హన్సిక షాకింగ్ పిక్!

0

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకు విడుదలకు ముందే భారీ హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఆసక్తికర పోస్టర్స్, సినిమా విడుదలపై ఆతృత కలిగించే టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టి తమ తమ సినిమాలపై పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హన్సిక లేటెస్ట్ మూవీ ‘మహా’ నుంచి ఓ ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రోజు (ఆగస్టు 9) హన్సిక పుట్టిన 30వ పుట్టినరోజు కానుకగా ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

హన్సిక 50వ సినిమాగా ‘మహా’ రూపొందుతోంది. యూఆర్ జామీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సంచలనంగా మారాయి. కాషాయం వస్తాలు ధరించి పొగ తాగుతున్న హన్సిక ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై క్రియేట్ అయిన అంచనాలకు రెక్కలు కడుతూ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హన్సిక చేతులు రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేనట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ మూవీ కథాంశం థ్రిల్లింగ్ చేయడం ఖాయం అని ఫిక్సయ్యారంతా.

ఇక ఇదే సినిమాలో హన్సిక బికినీలో కూడా మెరవనుందనే సమాచారం చెక్కర్లు కొడుతోంది. మెరిసే మేలిమి ఛాయతో కెమెరా కూడా కళ్ళు తిప్పలేనంత మాయ చేస్తూ కుర్రాకారును హుషారెత్తించే హన్సిక.. తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె పలువురు అగ్ర హీరోలతో సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. హన్సికపై అభిమానంతో త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా కట్టేయడం విశేషం.