Templates by BIGtheme NET
Home >> Cinema News >> పెళ్లికూతురు నిహారికకు అలా సర్ ప్రైజ్ ఇచ్చారు

పెళ్లికూతురు నిహారికకు అలా సర్ ప్రైజ్ ఇచ్చారు


మెగాడాటర్ నిహారిక పెళ్లి సంబరాలు ప్రస్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇంకో ఐదురోజులే సమయం మిగిలి ఉంది. ఆసియాలోనే రెండో పెద్ద ప్యాలెస్ అయిన ఉదయ్ పూర్ (రాజస్థాన్) ప్యాలెస్ లో నిహారిక – చైతన్యకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ జంటకు సంబంధించిన వెడ్డింగ్ ఆహ్వానాలు అందాయి. అందమైన డిజైనర్ శుభలేఖ ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యింది.

ఉదయ్ పూర్- ఉదయ్ విలాస్ లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో ఈ జంట వివాహం హిందూ సాంప్రదాయంలో జరగనుంది. ఓ వైపు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ .. మరోవైపు పెళ్లి ఏర్పాట్లతో బోలెడంత హంగామా నెలకొంది. వీటన్నిటినీ నిహారిక అన్నగారైన వరుణ్ తేజ్ అన్నీ తానే అయ్యి నడిపిస్తున్నారట.

తనకు సాయంగా మెగాస్టార్ చిరంజీవి- నాగబాబు వివాహ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు పరిమితంగా సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే వేదిక పై సందడి చేయనున్నారట. అంతేకాదు.. ఇప్పటికే నిహారిక .. చైతన్య ఇరువురు ప్రీవెడ్డింగ్ పార్టీలతో సందడి చేస్తున్నారు. స్నేహితులు సన్నిహితులకు స్పెషల్ విందు కార్యక్రమాలు అదరహో అనే రేంజులో ప్లాన్ చేశారట.

ఇక నిహారిక అక్కజెల్లెళ్లు తనని పెళ్లి కూతురిని చేశారు. బ్యాచ్లర్ పార్టీల్లోనూ కజిన్స్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారట. చిరంజీవి కుమార్తెలు సుస్మిత- శ్రీజ.. భర్తలు సహా ఈ పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వేడుక నుంచి ఫోటోల్ని కూడా షేర్ చేస్తున్నారు.

ఇక చెల్లిపెళ్లికి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ వరుణ్ తేజ్ బిజీగా ఉన్నాడు. అలాగే తన గారాల చెల్లికి బోలెడన్ని సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడట. ఈ వేడుక ఎప్పటికి పది కాలాల పాటు మర్చిపోలేని విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు వరుణ్. తన చెల్లెలిని ఖుషీగా ఉంచేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేక ప్లాన్లు వేశాడట. ఇక ఉన్నట్టుండి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా డాటర్స్ అంతా నిహారిక చెంతకే విచ్చేయడం అంతా సర్ ప్రైజింగ్ గా ఫీలవుతోందట. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా కజిన్స్ సందడి హైలైట్ గా మారిందట. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.