హనీ ఈజ్ ది బెస్ట్.. ఎందుకంటే?

0

హనీ ఈజ్ ది బెస్ట్.. హనీ ఈజ్ ది బెస్ట్!! అంటూ స్క్రీన్ అంతా రచ్చ రచ్చ చేస్తూ తెర నిండుగా గొప్ప వినోదాన్ని పండించారు. నిజమే.. హనీ అన్నివేళలా ది బెస్ట్. `ఎఫ్ 2`లో ఫన్ తో పాటు రొమాన్స్ ని జోడించి హనీ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు యంగ్ బోయ్స్ కి ఇట్టే కనెక్టయిపోయింది.

పెళ్లయినా పెళ్లాన్ని విడిచి విదేశాల్లో సెలబ్రేషన్ కోరుకునే పురుషపుంగవుడిగా వరుణ్ తేజ్ నటిస్తే అతడికి బుద్ధి చెప్పే హనీ పాత్రలో మెహ్రీన్ ఫీర్జద చక్కగా అభినయించింది. కోస్టార్ మిల్కీ బ్యూటీతోనే పోటీపడి నటించిందంటే అతిశయోక్తి కాదు.

అందుకే మెహ్రీన్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే అయినా ఇంకా ఎఫ్ 2 హనీ వైబ్స్ మాత్రం అలానే ఉండిపోయాయి గుండెల్లో. ఇక మెహ్రీన్ సోషల్ మీడియాల్లో ఇటీవల చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లోకి వెళుతోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ ట్రెండింగ్ గానూ మారింది.

బులుగు జిలుగు సముద్రం చెంత మెహ్రీన్ సెలబ్రేషన్ ఓ రేంజులోనే ఉంది మరి. బ్లూ బ్యాక్ డ్రాప్ లో రెడ్ హాట్ లుక్ తో.. గ్రీన్ లుక్ తో .. నేవీ బ్లూ లుక్ తో ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేసింది. ఈ ఫోటోలన్నీ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తున్నాయి. ఎంత మంచి వాడవురా.. అశ్వథ్థామ వంటి చిత్రాల్లో మెహ్రీన్ నటించింది. కానీ ఇవేవీ ఆశించిన విజయాల్ని ఇవ్వలేదు. దీంతో తెలుగు పరిశ్రమలో వెనకబడింది. అటు తమిళంలోనూ పట్టాస్ అనే చిత్రంలో నటిస్తే చక్కని గుర్తింపు దక్కింది.. కానీ ఆఫర్లు అయితే రాలేదు. తాజా ఫోటోషూట్లతో ఈ అమ్మడికి మైలేజ్ పెరుగుతుందేమో చూడాలి.