నభా నటేష్ నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా…?

0

టాలీవుడ్ యువ హీరో నితిన్ ‘భీష్మ’ సినిమా సక్సెస్ తో వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న ‘అంధాదున్’ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘అంధాదున్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా – రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించగా సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించింది. ఇక తెలుగు విషయానికొస్తే నితిన్ హీరోగా నటించబోయే తెలుగు రీమేక్ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కాగా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్న చిత్ర యూనిట్ ప్రధాన పాత్రల్లో నటించే నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాధికా ఆప్టే పోషించిన పాత్ర మేకర్స్ ఓ స్టార్ హీరోయిన్ ని సంప్రదించారట. అయితే ఆ హీరోయిన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పి ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కీర్తి సురేష్ లేదా ప్రియాంక మోహన్ లలో ఎవరో ఒకరు నితిన్ తో జతకట్టే అవకాశం ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ కోసం మేకర్స్ సంప్రదిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో నటిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. నితిన్ సినిమాకి పచ్చజెండా ఊపిందని కూడా అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.