Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిగ్ బాస్ : అప్పుడు ప్రియుడు ఇప్పుడు ప్రేయసి??

బిగ్ బాస్ : అప్పుడు ప్రియుడు ఇప్పుడు ప్రేయసి??


తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ తర్వాత సెలబ్రెటీలు కంటెస్టెంట్స్ గా వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో కనిపించడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమీ కలగడంలేదు. సీజన్ విన్నర్ లుగా నిలిచిన వారు కూడా ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లడం టైమ్ వృదా అని కొందరు అనుకున్నారు. కాని ఆ తర్వాత సీజన్ లు వారి ఆలోచన పూర్తిగా మార్చేశాయి. గడచిన రెండు సీజన్ ల్లో కనిపించిన వారు పెద్దగా ఫేమ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా బయటకు వచ్చారు. అందుకే సీజన్ 5కు కంటెంస్టెంట్స్ విషయంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొందని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సెప్టెంబర్ లో సీజన్ 5 ను మొదలు పెట్టడం కన్ఫర్మ్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఇప్పటికే కొద్ది మంది కంటెస్టెంట్స్ ఎంపిక అయ్యారు. అందులో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగు బుల్లి తెరపై తనదైన ముద్ర వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ నవ్య స్వామి. మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ఈమె మెల్ల మెల్లగా తెలుగు బుల్లి తెరపై అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు లో ఈమె సీరియల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈమె అంటే ప్రత్యేకమైన అభిమానంను తెలుగు ప్రేక్షకులకు కనబర్చుతున్నారు. అందుకే ఈమెకు తెలుగు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది.

ఈమె చేస్తున్న సీరియల్స్ ఉండటంతో పాటు షో లు కూడా ఉన్నాయి. అయినా కూడా ఈమెకు బిగ్ బాస్ నుండి వచ్చిన ఆఫర్ ను వెంటనే సద్వినియోగం చేసుకునేందుకు సిద్దం అయ్యిందట. ఈమె రవికృష్ణ వల్ల బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య వ్యవహారం సాగుతుందని బుల్లి తెలర ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కాని వారు మాత్రం ఆ వార్తలను నవ్వి కొట్టి పారేస్తున్నారు. ఇక రవి కృష్ణ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా కొనసాగాడు. మళ్లీ ఇప్పుడు ఆయన ప్రియురాలు అంటూ ప్రచారం జరుగుతున్న ముద్దుగుమ్మ నవ్య స్వామి బిబి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈమె ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.