స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన లేడీ ఫైర్ బ్రాండ్

0

మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ పార్వతి తిరువోత్తు కు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఆమె ఏదైనా ఇంటర్వ్యూలో లేదంటే టాక్ షో లో పాల్గొన్నది అంటే ఖచ్చితంగా వివాదాస్పద అంశాలను లేవనెత్తడం ఎవరిపైనో ఒకరిపై విమర్శలు చేయడం చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక మలయాళ స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు నా పట్ల ప్రవర్తించిన తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ ఆరోపించింది. అతడి పేరు చెప్పకుండానే విమర్శలు గుప్పించింది.

పార్వతి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నేను ఒక స్టార్ హీరోల సినిమాలో నటించాను. ఆయన సెట్ లో ఉన్నంత సేపు కూడా ఊరికే చిరాకు పడుతూ ఉండేవాడు. నాతో దారుణంగా వ్యవహరించాడు. ఆయన అలా ఎందుకు ఉండేవాడో నాకు అర్థం అయ్యేది కాదు. మాట్లాడితే ఎరినో ఒకరిని తిడుతూనే ఉండేవాడు. ఒక స్టార్ హీరో స్థాయికి తగ్గట్లుగా ఆయన ప్రవర్తన ఉండేది కాదు. షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా నాతో అతడు ప్రవర్తించిన తీరు బాగాలేదు. ఒకసారి ఆయన మీరా జాస్మిన్ పై కూడా వ్యాఖ్యలు చేశాడు.

నన్ను మీరా జాస్మిన్ ను ప్రతిభవంతులు కారంటూ విమర్శించాడు. దర్శకులు మిమ్ములను హీరోయిన్స్ గా నిలబెట్టారు అన్నాడు. మేమిద్దరం కూడా మానసిక రుగ్మతతో బాధపడుతున్నామని ఆయన అన్నాడు. ఇక్కడ నిజాలు మాట్లాడితే వారికి మతిస్థిమితం లేదు అన్నట్లుగా ముద్రించే ప్రయత్నం చేస్తారు. నాకేమో మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోటి మాట్లాడటం తెలియదు. అందుకే నేను మొదటి నుండి ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.