Templates by BIGtheme NET
Home >> Cinema News >> అశ్లీల యాప్ లో పునర్నవి ఫొటోలు.. స్పందించిన భూపాలం!

అశ్లీల యాప్ లో పునర్నవి ఫొటోలు.. స్పందించిన భూపాలం!


తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు ‘పునర్నవి భూపాలం’. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేమాయణం వార్తలతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా.. అశ్లీల వెబ్ సైట్లో తన ఫొటోలు హల్చల్ చేయడంపై స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించింది పునర్నవి.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఉయ్యాల జంపాల’లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రను పోషించి టాలీవుడ్లోకి ఎంటర్ అయిందీ బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ‘పిట్టగోడ’ ‘మనసుకు నచ్చింది’ ‘ఈ సినిమా సూపర్ హిట్’ ‘ఎందుకో ఏమోస వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ.. ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ మూడో సీజన్లో ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో తన మార్క్ ఆటతీరుతో పాటు స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఉంటూ ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది.

ఏమాత్రం అంచనాలు లేకుండానే షోలోకి ప్రవేశించిన పునర్నవి.. సింగర్ రాహుల్ సిప్లీగంజ్తో లవ్ ట్రాక్ నడిపిందన్న ప్రచారంతో ఎనలేని క్రేజ్ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రెండ్ అయింది. ఆ ప్రచారం నిజమేనా అన్నట్టుగా.. షో ముగిసిన తర్వాత కూడా చాలా రోజుల పాటు వీళ్లిద్దరూ కలిసి తిరిగారు. దీంతో రాహుల్.. పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది.

అయితే.. కొద్ది రోజుల క్రితం సినీ నటుడు రఘునందన్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత ఈ పిక్ ఆహా రూపొందించిన ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పునర్నవి.. బిగ్ బాస్ షో వల్ల తనకు లాభం జరగలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

కాగా.. తన ఫొటోలు ఓ డేటింగ్ యాప్లో కనిపించడంపై పునర్నవి క్లారిటీ ఇచ్చింది. ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన ఈ బ్యూటీ.. ‘డేటింగ్ యాప్లో ‘తార’ ‘హాసిని’ అనే పేర్లతో ఎవరో నా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారని చెప్పింది. కొందరు ఈ విషయం తన దృష్టికి తీసుకొచ్చారని అది చూసి షాకయ్యానని చెప్పింది. నిజానికి ఆ యాప్స్ తానెప్పుడూ వాడలేదని ఎవరితోనూ డేటింగ్ చేయలేదని చెప్పింది. గుర్తు తెలియనివాళ్లు చేసిన ఈ పనిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పుకొచ్చింది పునర్నవి.