ఇంతగా కవ్విస్తే టాలీవుడ్ పిలిచేయదూ?

0

సాక్షి మాలిక్ .. టాప్ మోడల్ కం నటి. పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసి టీవీ కమర్షియల్స్ తో ఆడియెన్ కి చేరువైంది. ఇంతకు ముందు మారుతి ఆటో ఎక్స్ పో-2020 వేదికపై బ్రాండ్ అంబాసిడర్ గా ర్యాంప్ పై మెరుపులు మెరిపించింది. ఆటో ఎక్స్ పో 2020 వేదికకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ టాప్ మోడల్. తర్వాత సినీరంగంపైనా ఆసక్తిని కనబరిచింది. కథానాయికగా వెలిగిపోవాలని కలలు గంటోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెతికేస్తున్న ఈ భామ లేటెస్ట్ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఇన్ స్టా వేదికగా చెలరేగుతున్న సాక్షి త్వరలో యూట్యూబ్ చానెల్లో ఫిట్నెస్ క్లాసులతో అభిమానుల్ని పెంచుకోవాలని ఆశిస్తున్నానని వెల్లడించింది.

ప్రస్తుతం భామలంతా మాల్దీవుల విహారంలో బిజీ బిజీ. సాక్షి కూడా అదే తరహా బ్లూ సీలో ఇదిగో ఇలా లేటెస్ట్ ఫోటోషూట్ లో పాల్గొంది. సాక్షి బికినీ లుక్ అంతర్జాలాన్ని ఓ రేంజులోనే షేక్ చేస్తోంది. బికినీపై ఫ్లోరల్ డిజైనర్ టాప్ తో సాక్షి మాలిక్ స్పెషల్ లుక్ తో ఆకట్టుకుంది. అందాల ఆమ మరీ ఇంతగా కవ్విస్తే టాలీవుడ్ పిలిచేయదూ? అంటూ బోయ్స్ కామెంట్లు జోరెక్కిపోతున్నాయ్.